New Ration Cards : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్…

New Ration Cards  : ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 6 గ్యారెంటీలలో ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , మరియు రేషన్ కార్డు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు అందించాల్సిన మీసేవ కేంద్రాల వద్ద జనం క్యూ కట్టేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఇది ఒక రక రకంగా గుడ్ న్యూస్ […]

  • Published On:
New Ration Cards : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్…

New Ration Cards  : ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 6 గ్యారెంటీలలో ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , మరియు రేషన్ కార్డు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు అందించాల్సిన మీసేవ కేంద్రాల వద్ద జనం క్యూ కట్టేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఇది ఒక రక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విడుదలకు శ్రీకారం చుట్టేసింది. ఈనెల 28 నుండి అర్హుల నుంచి కొత్త రేషన్ కార్డులు కోసం అప్లికేషన్ స్వీకరించబోతుంది. అదేవిధంగా ఇచ్చిన దరఖాస్తులలో తప్పులను సరిజేయడంపై కూడా దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లుగా సమాచారం. ఈ నేపద్యంలోనే ఈనెల 28 నుంచి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డులు , పెన్షన్ , సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

అయితే 2019లో వరస ఎన్నికల కారణంగా రేషన్ కార్డులు ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయి వేరుగా ఉంటున్నవారు , అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూనేే ఉన్నారు. అయితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా రేషన్ పొందాలంటే కచ్చితంగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి కచ్చితంగా సమర్పించాలి. అలాగే కుటుంబ యజమానితో దిగిన ఫోటో మరియు స్వికరణ పత్రం అలాగే ఆదాయ సర్టిఫికెట్ పరిమితికి మించకుండా ఉన్నవారికి రేషన్ కార్డు లేకపోవడం వలన వేలాది కుటుంబాలు ఉచిత బియ్యానికి దూరమైన పరిస్థితి ఏర్పడింది.

అలాగే ఆహార భద్రత కార్డులు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉండటం వలన గత ప్రభుత్వంలో సుమారు 6 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు జారీ జరగలేదు. అంతేకాక ఉన్న కార్డులలో కూడా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం రేషన్ కార్డు కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ కూడా రెట్టింపు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో నూతన సంస్థలు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రేషన్ కార్డులో కరక్షన్స్ చేసుకోవడానికి కొత్తవారిని చేర్చుకోవడానికి మార్గం చేసింది. ఈ నేపథ్యంలోనే చాలామందికి ఫిబ్రవరి నెలలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులు త్వరలోనే రాబోతున్నాయని ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది.