EX CM KCR : కాలు జారిపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…ఆసుపత్రికి తరలింపు…

EX CM KCR  : ఇలా ప్రభుత్వం మారిందో లేదో అనుకోని ఘటనలు చూడాల్సి వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన మాజీ సీఎం కేసీఆర్ తాజాగా యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో కాలుజారి పడటం వలన ఆయనకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోనే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పలువురు తెలియజేస్తున్నారు. అయితే అర్ధరాత్రి […]

  • Published On:
EX CM KCR : కాలు జారిపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…ఆసుపత్రికి తరలింపు…

EX CM KCR  : ఇలా ప్రభుత్వం మారిందో లేదో అనుకోని ఘటనలు చూడాల్సి వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన మాజీ సీఎం కేసీఆర్ తాజాగా యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో కాలుజారి పడటం వలన ఆయనకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోనే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పలువురు తెలియజేస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లో తిరుగుతుండగా కాలికి పంచ తగిలి కాలుజారి కెసిఆర్ కింద పడినట్లుగా సమాచారం.

ఇక కెసిఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులంతా కేసిఆర్ ను వెంటనే యశోద హాస్పిటల్ కు తరలించారు. కేటీఆర్ కుటుంబంతో పాటు హరీష్ రావు కూడా రాత్రికి రాత్రే ఆసుపత్రికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. తెల్ల వారుజాము వరకు అక్కడే ఉండి వైద్యులతో మాట్లాడి వైద్య పరీక్షలు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే వారు తిరిగి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం యశోద ఆసుపత్రిలోని తొమ్మిదవ ఫ్లోర్ లో కేసీఆర్ కు చికిత్స కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు వైద్యులు టెస్టులు నిర్వహించి హెల్త్ బులెటిన్ ఇస్తారని తెలియజేశారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇలా జరగడంతో ఆయన అభిమానులు తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.