Nalgonda : లంచాలకు కేరాఫ్ అడ్రస్ ఈ తహసిల్దార్…..ఇంట్లో గుట్టలు గుట్టలు నోట్ల కట్టలు…. కిలోల కొద్ది బంగారం….

Nalgonda : ఇంట్లో కట్టల కొద్ది నోట్లు…కిలోల కొద్ది బంగారం…భారీగా ఆస్తులు..ఇవన్నీ ఓ బడ వ్యాపారి ఇంట్లో అనుకుంటే పొరపాటే..ఇది ఓ తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేసినప్పుడు బయటపడిన సొమ్ము. ఎన్ని రోజుల నుండి దాస్తున్నాడో తెలియదు కానీ ఏసీబీ అధికారుల సోదాలతో అతని బండారం మొత్తం బయటపడింది…పూర్తి వివరాల్లోకెళ్తే తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ అవినీతి ఇటీవల వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మర్రిగూడ తాసిల్దార్ గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి ఇంటిపై ఇటీవల […]

  • Published On:
Nalgonda : లంచాలకు కేరాఫ్ అడ్రస్ ఈ తహసిల్దార్…..ఇంట్లో గుట్టలు గుట్టలు నోట్ల కట్టలు…. కిలోల కొద్ది బంగారం….

Nalgonda : ఇంట్లో కట్టల కొద్ది నోట్లు…కిలోల కొద్ది బంగారం…భారీగా ఆస్తులు..ఇవన్నీ ఓ బడ వ్యాపారి ఇంట్లో అనుకుంటే పొరపాటే..ఇది ఓ తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేసినప్పుడు బయటపడిన సొమ్ము. ఎన్ని రోజుల నుండి దాస్తున్నాడో తెలియదు కానీ ఏసీబీ అధికారుల సోదాలతో అతని బండారం మొత్తం బయటపడింది…పూర్తి వివరాల్లోకెళ్తే

corrupted-revenue-tahsildar

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ అవినీతి ఇటీవల వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మర్రిగూడ తాసిల్దార్ గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి ఇంటిపై ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించడం జరిగింది. మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఇటీవల అతని ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో తహసిల్దార్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వనస్థలిపురం హస్తినాపురం లోని శిరిడి స్థాయి నగర్ లో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి ఇంటితోపాటు అతని బంధువులు మరియు సన్నిహితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. మహేందర్ కు సంబంధించి దాదాపు 15 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎసిబి అధికారులు చెబుతున్నారు.

corrupted-revenue-tahsildar

ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఇంట్లో ఎవరు ఊహించని విధంగా భారీగా నోట్ల కట్టలు కిలోల కొద్ది బంగారాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. ఇక మహేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన ట్రంకు పెట్టెలో ఉన్న డబ్బును చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఒక్క పెట్టిలోనే దాదాపు 2 కోట్లకు పైగా నగదు దొరికినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక దీనితో పాటు మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారాన్ని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మహేందర్ రెడ్డి పేరుపై భారీగా ఉన్న ఆస్తులను గుర్తించారు. మహేందర్ రెడ్డి కి సంబంధించి సన్నిహితుల ఇల్లు కార్యక్రమాలలో 15 చోట్ల సోదాలు నిర్వహించగా కీలక డాక్యుమెంట్స్ దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అయితే ఏసీబీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.