Barrelakka Sirisha : బర్రెలక్క పై కేసీఆర్ పంచులు…

Barrelakka Sirisha : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హవా జోరుగా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలను గెలిచేందుకు అన్ని పార్టీల వారు గట్టిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా గెలుపు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈ పార్టీకు కాంగ్రెస్ మరియు బిజెపి గట్టి పోటీని ఇస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం స్వతంత్ర అభ్యర్థిగా బర్రెల అక్క అనే మహిళ పోటీ చేస్తున్న సంగతి […]

  • Published On:
Barrelakka Sirisha : బర్రెలక్క పై కేసీఆర్ పంచులు…

Barrelakka Sirisha : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హవా జోరుగా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలను గెలిచేందుకు అన్ని పార్టీల వారు గట్టిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా గెలుపు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈ పార్టీకు కాంగ్రెస్ మరియు బిజెపి గట్టి పోటీని ఇస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం స్వతంత్ర అభ్యర్థిగా బర్రెల అక్క అనే మహిళ పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తూరు మండలం మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క అలియాస్ శిరీష అసెంబ్లీ స్థానాని పొందేందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగింది.

నిరుద్యోగం అనే అంశంపై ప్రధానంగా ఎన్నికల బరిలో దిగిన బర్రె లెక్క ఉద్యోగం లేక గేదెలను కాసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉండేది. ఇక ఆ వీడియోలలో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆమెపై కేసు కూడా నమోదు అయింది. దీంతో ఒక్కసారిగా ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడ్డారు. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రచారం చేస్తూ వస్తుంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క తాజాగా తన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఇక ఆమె విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగం , నిరుద్యోగులకు ప్రత్యేకమైన కోర్సు , ఫ్రీ కోచింగ్, పేదలకు ఇండ్లు నిర్మాణం ఉచిత వైద్య విద్య వంటి సదుపాయాలను చేయనున్నట్లు తెలియజేసింది.

అయితే తాజాగా కెసిఆర్ బర్రెలక్క గురించి ప్రస్తావించటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెసిఆర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం…పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది…ఒకప్పుడు కరెంటు కోత ,మంచినీళ్ల తిప్పలు , చేనేత కార్మికులు , మరియు రైతుల ఆత్మహత్యలకు తెలంగాణ నిలయంగా ఉండేదని తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 24 గంటలు కరెంటు , పెన్షన్ ఇస్తున్నామని తెలియజేశారు. అలాగే ఒక్కొక్క పార్టీ నుండి ఒక్కొక్కరు నిలబడుతున్నారు. ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తున్నారు. వారు చెప్పిన మాటలు విని మీరు ఆగం కాకండి , తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మీరు వేసే ఓట్లు తెలంగాణ బ్రతుకుతెరువును నిర్ణయిస్తాయని తెలియజేశారు.

https://youtu.be/qEJ6915n-U0?si=_mVedBwKabcGWLN3