Barrelakka Sirisha : రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన బర్రెలక్క…

Barrelakka Sirisha  : పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనలో ఉన్న ప్రజలు తాజాగా కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం పదవిని స్వీకరించాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి రావడమే ఆలస్యం తాను చేపట్టిన 6 గ్యారంటీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ […]

  • Published On:
Barrelakka Sirisha : రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన బర్రెలక్క…

Barrelakka Sirisha  : పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనలో ఉన్న ప్రజలు తాజాగా కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం పదవిని స్వీకరించాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి రావడమే ఆలస్యం తాను చేపట్టిన 6 గ్యారంటీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా దీనికి సంబంధించిన రెండు గ్యారెంటీలను కూడా అమలు చేశాడు. అలాగే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి దానిలోకి ప్రజలకు ఎంట్రీ అవకాశాన్ని కూడా కల్పించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉండగా తాజాగా బర్రె లెక్క రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బర్రెలకు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేయడం జరిగింది.

barrelakka-sirisha-shocking-comments-on-revanth-reddy

 

నిజానికి బర్రెలకు సామాన్యురాలు. నిరుపేద కుటుంబానికి చెందింది. అయితే గతంలో ఒక వీడియోలో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ జాబ్ దొరకకపోవడంతో బర్రెలు కాసుకుంటున్నట్లుగా వీడియో చేసి ఫేమస్ అయింది. అలా ఒక్క వీడియోతో అందరి దృష్టిలో పడిన బర్రెలక్క అలియాస్ శిరీష…అలా సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు షేర్ చేస్తూ నిరుద్యోగుల కోసం పోరాటం చేయడానికి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బర్రెలక్క కి చాలామంది మద్దతు తెలిపారు. కేవలం తన నియోజకవర్గం ప్రజలే కాకుండా ఇతర నియోజకవర్గ ప్రజల నుంచి కూడా బర్రెలక్కకు మంచి ఆదరణ లభించింది. కనీసం ప్రచారానికి కూడా డబ్బుల్లేని పరిస్థితిలో ఉన్న బర్రెలక్కకు చాలామంది వాహన సదుపాయంతో పాటు విరాళాలు కూడా అందజేశారు. అంతేకాక ప్రజలలో ఆమెకు లభించిన మద్దతు చూసి ఇతర పార్టీ వారు బరేలక్క ఎక్కడ విజయం సాధిస్తుందని భయపడి ఆమెపై దాడులు కూడా చేశారు. ఇక ఆ సింపతీతో ప్రజలలో మంచి ఆదరణ లభించింది కానీ ఫలితాల రోజు మాత్రం ఆమెకు నిరాశ మిగిలింది.

అయితే ఇప్పుడు బర్రెలక్క ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయనున్నట్లుగా సమాచారం. అయితే తాజాగా రేవంత్ రెడ్డి గురించి కూడా బర్రెలక్క కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన రేవంత్ రెడ్డి తన మంచి పనులతో మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో సీఎం గా అడుగుపెట్టిన రోజు నుండే రేవంత్ అన్ని సదుపాయాలు కల్పిస్తుండగా.. తమ కొల్లాపూర్ ని కూడా రేవంత్ రెడ్డి తప్పకుండా బాగు చేస్తాడని శిరీష పేర్కొంది. అంతేకాక ఆయన ఇచ్చిన పథకాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. అదేవిధంగా రైతులకు కూడా ఆయన మంచి చేస్తాడని ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా చాలా మంచి పనులు చేస్తాడంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక ప్రగతిభవన్ కు ప్రతి సామాన్యుడు వచ్చే విధంగా చేయడం నిజంగా గర్వకారణం అంటూ తెలియజేసింది.