Belt Shops Abolish : తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్…మద్యం షాపుల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు…

Belt Shops Abolish : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే కరెంటు, ఇరిగేషన్ శాఖలతో పాటు ఉద్యోగ భర్తీ, టిఎస్ఆర్టిసి బోర్డుపై స్పెషల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మద్యం దుకాణాలు బెల్ట్ షాపులపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులను మూయించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు […]

  • Published On:
Belt Shops Abolish : తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్…మద్యం షాపుల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు…

Belt Shops Abolish : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే కరెంటు, ఇరిగేషన్ శాఖలతో పాటు ఉద్యోగ భర్తీ, టిఎస్ఆర్టిసి బోర్డుపై స్పెషల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మద్యం దుకాణాలు బెల్ట్ షాపులపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులను మూయించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే గ్రౌండ్ వరకు ప్రారంభించగా త్వరలోనే మద్యం దుకాణాలను బ్యాన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

bad-news-for-telangana-peoples-congress-government-is-working-towards-liquor-shops

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ మూయించేస్తామని చెప్తూ వచ్చారు.  ఇక ఇదే విషయాన్ని మ్యానిఫెస్టోలో కూడా వారు చూపించారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్ షాపులను ముగించే దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా…వాటికి అనుబంధంగా గ్రామాలలో లక్షకు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అయితే మద్యం దుకాణాలలో పరిమితి సమయం వరకు మందును అమ్ముతుండగా, బెల్ట్ షాపులలో మాత్రం 24 గంటలు లిక్కర్ అమ్ముడు అవుతూనే ఉంది.

అయితే బెల్ట్ షాప్ ల వలన గ్రామాలలో నివసిస్తున్న యువత మద్యానికి బానిసలవుతున్నారని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నారు.  అలాగే బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుంటే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ ప్రణాళిక ను సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 11:00 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచి మందు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వమే ఈ సమయాన్ని నిర్దేశించగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సమయాన్ని కూడా తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దీనిపై ఎక్సైజ్ శాఖతో సుదీర్ఘ చర్చలు జరిపి ఓ సమయాన్ని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.