KTR : ఒక పాట ప్రభుత్వాన్ని మార్చేసింది…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…

KTR : తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించడం జరిగింది. జిల్లా కేంద్రాలలో శుభకార్యాలు జరుపుకున్న పలువురు నాయకులను కేటీఆర్ స్వయంగా వెళ్లి కలిశారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం సర్పంచులకు నిర్వహించిన ఆత్మీయ సత్కారం కార్యక్రమాలలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పదవి నుండి వెళ్లిపోయే ముందు వారిని గౌరవంగా పంపించాలనే భావనతోనే ఈ ఆత్మీయ సత్కారం కార్యక్రమం […]

  • Published On:
KTR : ఒక పాట ప్రభుత్వాన్ని మార్చేసింది…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…

KTR : తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించడం జరిగింది. జిల్లా కేంద్రాలలో శుభకార్యాలు జరుపుకున్న పలువురు నాయకులను కేటీఆర్ స్వయంగా వెళ్లి కలిశారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం సర్పంచులకు నిర్వహించిన ఆత్మీయ సత్కారం కార్యక్రమాలలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పదవి నుండి వెళ్లిపోయే ముందు వారిని గౌరవంగా పంపించాలనే భావనతోనే ఈ ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. పదవులు అనేవి వస్తాయి పోతాయి అవి ఏవి శాశ్వతం కాదు.

a-song-changed-the-government-ktrs-sensational-comments

కానీ పదవిలో ఉన్నప్పుడు మనం ఎంత మంచిగా పని చేశామన్నదే ముఖ్యమని కేటీఆర్ తెలియజేశారు. ఇక పదవిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా మంచి చేశారు కాబట్టి ప్రజలు కేసీఆర్ ని ఇప్పటికీ తలుచుకుంటున్నారని , ఆయన ముఖ్యమంత్రి కాకపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలోనే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో డంపింగ్ యార్డ్ , పల్లె ప్రకృతి వనం , ,వైకుంఠధామాలు, ట్యాంకర్లు , ట్రాక్టర్లు ,నర్సరీలు లాంటివి మరి ఎక్కడ లేవని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.

దీనికి అన్ని విధాలుగా కష్టపడి పనిచేసి ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రంగా మార్చినందుకు సర్పంచులకు సలాం చేశారు. అదే విధంగా 2014 నుండి ఇప్పటివరకు తెలంగాణకు 82 అవార్డులు వచ్చాయని , దేశంలో 30% అవార్డులు మన రాష్ట్రానికి రావడం గర్వంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రధానమంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకంలో దేశంలోనే టాప్ 20 లో 19 గ్రామాలు తెలంగాణవే కావడం గొప్ప విషయం అని ఆయన తెలియజేశారు. అదేవిధంగా పెండింగ్ బిల్లుల సమస్యపై మరియు సర్పంచ్ల తరఫున ప్రభుత్వంతో మాట్లాడేందుకు తాను గొంతు విప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు.