ICC World Cup 2023 Final : రేపు ఉదయం 7 గంటల నుండి వరల్డ్ కప్ ఫైనల్ లైవ్…ఎందుకో తెలుసా….?

ICC World Cup 2023 Final : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపు భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మెగా ఫైనల్ కు గ్రాండ్ గా క్లోజింగ్ సెర్మని బీసీసీఐ నిర్వహించడం జరిగింది.ఇక ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి పదినిమిషాల ముందు మన భారతదేశ వాయుసేన సూర్య కిరణ్ […]

  • Published On:
ICC World Cup 2023 Final : రేపు ఉదయం 7 గంటల నుండి వరల్డ్ కప్ ఫైనల్ లైవ్…ఎందుకో తెలుసా….?

ICC World Cup 2023 Final : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపు భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మెగా ఫైనల్ కు గ్రాండ్ గా క్లోజింగ్ సెర్మని బీసీసీఐ నిర్వహించడం జరిగింది.ఇక ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి పదినిమిషాల ముందు మన భారతదేశ వాయుసేన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం కొన్ని విన్యాసాలను చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మ్యాచ్ సమరానికి స్టార్ స్పోర్ట్స్ లైవ్ కవరేజ్ రేపు ఉదయం 7:00 గంటల నుండి ప్రసారం కానుంది.

Cricket World Cup 2023 IND vs AUS Playing 11, toss result, streaming

అయితే క్రికెట్ మ్యాచ్ మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం కానుండగా దాదాపు 7 గంటల ముందే అంటే రేపు ఉదయం 7:00 గంటలకు స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ ప్రసారం మొదలవుతుంది. సాధారణంగా అయితే ఒక మ్యాచ్ లైవ్ కవరేజ్ అనేది గంట లేదా రెండు గంటల ముందు నుండి మొదలవుతుంది. కానీ ఈసారి మాత్రం భారత్ ఫైనల్ కు చేరుకోవడంతో ఉదయం 7 గంటల నుండి మనకు ప్రసారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మ్యాచ్ టాస్ యధావిధిగా 1:30 కి మొదలవుతుంది. ఆ తర్వాత రెండు గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అయితే క్రికెట్ మ్యాచ్ లైవ్ ఇంత త్వరగా టెలికాస్ట్ చేయడం క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.

మునిపెన్నడు ఇంత త్వరగా లైవ్ టెలికాస్ట్ జరిగిన సందర్భాలు లేవు. ఇక ఈ లైవ్ టెలికాస్ట్ లో మాయంతి లంగర్ స్టార్ స్పోర్ట్స్ గ్లామర్ యాంకర్ గా సందడి చేయనున్నారు. అలాగే ఈ మ్యాచ్ ను అనాలసిస్ చేయడానికి సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లె , సంజయ్ మంత్రికర్ తదితరులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం ఏడు గంటల నుండి ఇండియా వరల్డ్ కప్ జర్నీ , ప్రోగ్రామ్స్ , ఇంటర్వ్యూస్ లాంటివి జరుగుతాయి. అలాగే ఈ మ్యాచ్ కు భారత్ మరియు ఆస్ట్రేలియా ప్రధానులు కూడా హాజరు కానున్నారు.