IND vs AUS T20 : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య కుమార్ యాదవ్…టి20 లో తగ్గేదేలే…

IND vs AUS T20 : వన్డే ఫార్మేట్ ఎలా ఆడినా సరే టి20లో మాత్రం టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సూర్యయ కుమార్ యాదవ్ రెచ్చిపోయి ఆడతాడు. ఇక ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తన ఫామ్ ను కొనసాగించలేకపోయిన సూర్య కుమార్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో విజృంభించి ఆడాడు. 9 ఫోర్లు, 4 […]

  • Published On:
IND vs AUS T20 : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య కుమార్ యాదవ్…టి20 లో తగ్గేదేలే…

IND vs AUS T20 : వన్డే ఫార్మేట్ ఎలా ఆడినా సరే టి20లో మాత్రం టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సూర్యయ కుమార్ యాదవ్ రెచ్చిపోయి ఆడతాడు. ఇక ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తన ఫామ్ ను కొనసాగించలేకపోయిన సూర్య కుమార్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో విజృంభించి ఆడాడు. 9 ఫోర్లు, 4 సిక్స్ లతో కేవలం 42 బంతుల్లో 80 పరుగులు చేసి తన జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ,కే ఎల్ రాహుల్ , శ్రేయస్ అయ్యర్ రికార్డులపై సూర్య కన్నేసాడు.

surya-kumar-yadav-who-broke-kohlis-record

అయితే ఆగస్టులో వెస్టిండీస్ తో జరిగిన నాలుగు , ఐదు టి20లో సూర్య వరుసగా హాఫ్ సెంచరీలు చేసాడు. అలాగే విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కూడా సూర్య కుమార్ ఆప్ సెంచరీ సాధించాడు. దీంతో టి20 ఫార్మేట్ లో హ్యాట్రిక్ ఆప్ సెంచరీలు సాధించిన 5వ భారత బ్యాటరీగా సూర్య నిలిచాడు. అయితే ఈ ఘనతను మొదటిసారి 2012లో విరాట్ కోహ్లీ సాధించగా అనంతరం 2014 ,2016 లో కూడా హ్యాట్రిక్ ఆప్ సెంచరీలు కోహ్లీ సాధించాడు.  ఆ తర్వాత 2018 లో రోహిత్ శర్మ , 2021లో కేఎల్ రాహుల్ , 2022 శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ ఆప్ సెంచరీలు సాధించిన ప్లేయర్స్ గా ఉన్నారు.

surya-kumar-yadav-who-broke-kohlis-record

అయితే తాజాగా సూర్యకుమార్ కూడా ఈ జాబితాలో జాయిన్ అయ్యాడు. అయితే గత సంవత్సరం కూడా సూర్య హ్యాట్రిక్ ఆఫ్ సెంచరీలు చేశాడు. అలాగే రేపు కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగబోయే టి20 మ్యాచ్ లో సూర్య హాఫ్ సెంచరీ సాధించినట్లయితే వరుసగా నాలుగు టి20 మ్యాచ్ లో ఆప్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారత ఆటగాడిగా సూర్యకుమార్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం టి20 క్రికెట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు 54మ్యాచులు ఆడాడు. 173 స్ట్రైక్ రేటుతో 46 సగటుతో 1921 పరుగులు చేసాడు. దీనిలో 3 సెంచరీలు, 16 ఆప్ సెంచరీలు ఉండడం గమనార్హం.