IPL 2023 : సారీ చెప్పకుండా తల పొగరు చూపిస్తున్నాడు..ఆ క్రికెటర్ పై కోహ్లీ అభిమానులు ఆగ్రహం..

IPL 2023  : ప్రస్తుతంలో భారతదేశంలో ఐపీఎల్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ కి మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి మరియు మాజీ క్రికెటర్ గంభీర్ కి మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్లో వీరు కొట్టుకునే అంత పని చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే. ఈ సంవత్సరం సీజన్లో చిన్న స్వామి స్టేడియం వేదికగా […]

  • Published On:
IPL 2023 : సారీ చెప్పకుండా తల పొగరు చూపిస్తున్నాడు..ఆ క్రికెటర్ పై కోహ్లీ అభిమానులు ఆగ్రహం..

IPL 2023  : ప్రస్తుతంలో భారతదేశంలో ఐపీఎల్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ కి మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి మరియు మాజీ క్రికెటర్ గంభీర్ కి మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్లో వీరు కొట్టుకునే అంత పని చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే. ఈ సంవత్సరం సీజన్లో చిన్న స్వామి స్టేడియం వేదికగా లకలక్నో కి మరియు ఆర్ సిబికి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం గంభీర్ స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇక నోరు మూసుకోండి అన్నట్లుగా నోటి మీద వేలు వేసుకుని చూపించాడు.

kohlis-fans-are-angry-with-that-cricketer

ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లీ రివెంజ్ మైండ్ తో బరిలోకి దిగినట్లుగా అర్థమవుతుంది.  లక్నో హోం గ్రౌండ్ వేదికగా జరిగినిన మ్యాచ్లో వికెట్లు పడినప్పుడు దూకుడుగా సెలబ్రేషన్ చేయడం లాంటివి చేసాడు. ఈ క్రమంలోనే లక్నో ఇన్నింగ్స్ 17 ఓవర్ లో ఉన్నప్పుడు నవీన్ ఉల్ హాక్ కు మరియు విరాట్ కోహ్లీకి మధ్య చిన్నపాటి మాటలు యుద్ధం మొదలైంది. అంపైర్లు జోక్యం చేసుకొని గొడవను ఆపారు. కానీ ఆ గొడవ అక్కడితో ఆగలేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో మరల నవీన్ కోహ్లీ మధ్య గొడవ మొదలైంది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరు విడిపించుకున్నారు. ఇక తర్వాత లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లీతో మాట్లాడుతూ వస్తుండగా..

kohlis-fans-are-angry-with-that-cricketer

గంభీర్ వెళ్లి కోహ్లీ తో మాట్లాడవద్దు అంటూ మైర్స్ ను పక్కకు తీసుకెళ్లాడు.  దీంతో కోహ్లీ గంభీర్ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. గొడవ అంతా సద్దుమణిగాక విరాట్ కోహ్లీ మరియు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద నిలుచుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన నవీన్ ను రాహుల్ పీల్చి కోహ్లీకి సారీ చెప్పమంటే , నవీన్ మాత్రం నేను చెప్పను అన్నట్లు వెళ్లిపోయారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నవీన్ పై విరాట్ కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి దాన్ని సీరియస్ గా తీసుకుని సారీ చెప్పకపోవడం ఏంటంట్టూ నవీన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.