Viral News : మద్యం మత్తులో ఏడవ తరగతి బాలురు…న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు..

Viral News : నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో సాగుతున్న మన భారతదేశంలో రోజురోజుకి విష సంస్కృతి విపరీతంగా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది , పిల్లలు నేడు మద్యపానానికి బానిసలు అవుతున్నారు. రేపటి తరం భవిష్యత్తు నాశనం అయ్యే విధంగా కనిపిస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోను చూసినట్లయితే ప్రతి ఒక్కరు ముక్కున వేలు వేసుకోవాల్సిందే. దాదాపు […]

  • Published On:
Viral News : మద్యం మత్తులో ఏడవ తరగతి బాలురు…న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు..

Viral News : నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో సాగుతున్న మన భారతదేశంలో రోజురోజుకి విష సంస్కృతి విపరీతంగా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది , పిల్లలు నేడు మద్యపానానికి బానిసలు అవుతున్నారు. రేపటి తరం భవిష్యత్తు నాశనం అయ్యే విధంగా కనిపిస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోను చూసినట్లయితే ప్రతి ఒక్కరు ముక్కున వేలు వేసుకోవాల్సిందే. దాదాపు 12-13 ఏళ్ల వయసు గల ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు న్యూ ఇయర్ సందర్భంగా ఫుల్లుగా మద్యం సేవించి ఊగుతూ తూగుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే…

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా చోడవరంలోని బాలుర వసతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఏడవ తరగతి చదువుతున్న హాస్టల్ విద్యార్థులు పార్టీ చేసుకున్నారు. నిజానికి ఆ వయసు గల పిల్లలు పార్టీ అంటే కేక్ కట్ చేసుకొని బూందీ , మిక్చర్ , కూల్ డ్రింక్ తాగడమే కదా అనుకుంటే పొరపాటే. అవి తాగితే ఏం కిక్ ఉంటుంది అనుకున్నారో ఏమో ఏకంగా మందు , బీర్లు తెచ్చుకొని మద్యపానంలో మునిగి తేలారు. ఇక దీనిని గమనించిన ఓ వ్యక్తి ఇదేంట్రా అని అడిగితే నువ్వు ఫస్ట్ వీడియో కట్ చెయ్ అన్న అంటూ స్వీట్ వాయిస్ తో ఘాటు వ్యాఖ్యలు చేయసాగారు.

ఇక వీడియో తీస్తున్న వ్యక్తి ఎంతసేపటికి వీడియో ఆపకపోవడంతో ఎంత చెప్పినా ఆపట్లేదని కోపంతో అందరూ కలిసి అతనిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు.మరి హాస్టల్లో ఇంత తతంగం జరుగుతుంటే హాస్టల్ సిబ్బంది ఏం చేస్తున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంత చిన్న వయసులోనే ఈ విధంగా మధ్యపానానికి అలవాటు పడితే రేపటి తరం భవిష్యత్తు ఏంటి అనేది తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే రేపటి తరం భవిష్యత్తుని వారి చేతులారా వారే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు.