Big Temple :ఇదే ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అయోధ్య రామాలయం కంటే ఐదు రెట్లు పెద్దది…

Big Temple : అయోధ్యలోని శ్రీ రామ మందిరం బాల రాముని విగ్రహ ప్రతిష్ట జనవరి 22 న అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఈ రామ మందిరం ఐదు రెట్లు పెద్దది అని తెలుస్తుంది. అయితే ఈ ఆలయాన్ని వేరువేరు దేశాలలో కాకుండా మన భారతదేశంలోనే నిర్మిస్తున్నారు. అది ఎక్కడ అంటే బీహార్ తూర్పు చంపారన్ లోని […]

  • Published On:
Big Temple :ఇదే ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అయోధ్య రామాలయం కంటే ఐదు రెట్లు పెద్దది…

Big Temple : అయోధ్యలోని శ్రీ రామ మందిరం బాల రాముని విగ్రహ ప్రతిష్ట జనవరి 22 న అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఈ రామ మందిరం ఐదు రెట్లు పెద్దది అని తెలుస్తుంది. అయితే ఈ ఆలయాన్ని వేరువేరు దేశాలలో కాకుండా మన భారతదేశంలోనే నిర్మిస్తున్నారు. అది ఎక్కడ అంటే బీహార్ తూర్పు చంపారన్ లోని కధ్వాలియా లో అతి పెద్ద రామాలయం నిర్మిస్తున్నారు. అయితే ఈ రామాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అయోధ్యలోని శ్రీ రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ రామాలయన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నవంబర్ 13- 2013 న ఈ ఆలయ భవిష్యత్ నమూనా ను ఆవిష్కరించారు.

అయితే ఈ రామాలయానికి ఒక పేరు కూడా పెట్టారు. ఆ రామాలయం పేరు విరాట్ రామాయణ దేవాలయం. అయితే ఈ ఆలయం నిర్మాణ పనులు మే 2023లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. 2025 చివరి నెల నాటికి ఆలయం పూర్తిగా సిద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. ఇక ఈ ఆలయం పూర్తిగా నిర్మించిన తర్వాత అయోధ్య నుంచి జనక్పూర్ వైపు వెళ్లేటప్పుడు ఈ ఆలయం కనిపిస్తుంది అని తెలుస్తుంది. ఆలయ సమాచారం ప్రకారం ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారం 125 ఎకరాల స్థానంలో విస్తరించి ఉంటుంది. అయితే దీనిని మరి కొంచెం విస్తరించి 200 ఎకరాలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ కొత్త దేవాలయం ప్రపంచంలో అత్యంత ఎత్తైన దేవాలయంగా ఒకటిగా ఉండబోతుంది అంట. ఇక ఈ రామాయ్య దేవాలయం పొడవు 1080 అడుగులు గా వెడల్పు 540 అడుగులుగా రూపొందిస్తున్నారు. అలాగే ఈ ఆలయ వైశాల్యం 3.3.6 ఏడు లక్షల చదరపు అడుగులు గా ఉంటుంది. ఈ ఆలయం మొత్తం 312 సంభాలతో నిర్మిస్తున్నారు అని తెలుస్తుంది.ఇక దేశంలోనే అత్యంత పెద్ద ఆలయం కావడంతో ప్రస్తుతం ఈ ఆలయం దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా అయోధ్య రాముని ఆలయం కోసం ఎదురుచూసిన భక్తుల కల నెరవేరిన వేళ బీహార్ లో నిర్మిస్తున్న మరో అతిపెద్ద ఆలయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆలయం అతి త్వరలోనే అన్ని పనులను పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం అవ్వనున్నట్లు సమాచారం.