IND vs PAK : దాయాదుల మధ్య యుద్ధం…అది చూడడానికి ఈ ప్రపంచమే సిద్ధం…
IND vs PAK : క్రికెట్ ప్రపంచ కప్ లో అసలు సిసలైన సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదుల పోరుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరుజట్లు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఇక […]
IND vs PAK : క్రికెట్ ప్రపంచ కప్ లో అసలు సిసలైన సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదుల పోరుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరుజట్లు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఇక భారత్ బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ కె.ఎల్ రాహుల్ ,మంచి ఫామ్ లో ఉండగా,
బౌలింగ్ విభాగంలో బూమ్రా మెరుపులు మెర్పిస్తున్నారు.ఇక ప్రపంచ కప్ లో భాగంగా 1992 నుండి భారత్ పాకిస్తాన్ కి మధ్య ఏడుసార్లు మ్యాచ్ జరగగా అన్నిసార్లు భారత్ విజయం సాధించడం గమనార్హం. ఇక ఇప్పుడు కూడా ఇదే జోరు కొనసాగించాలని రోహిత్ సేన ప్రయత్నిస్తుంది . అలాగే మొన్నటి వరకు డెంగ్యూ తో బాధపడిన శుబ్ మన్ గిల్ కూడా కోలుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే శుబ్ మన్ గిల్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఉంటాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ శుబ్ మన్ గిల్ జట్టులో లేనట్లయితే ఇషాన్ కు మరొక అవకాశం లభిస్తుంది.
ఇక బౌలింగ్ విభాగం గురించి మాట్లాడితే స్టార్ బౌలర్ బుమ్రా మంచి ఫామ్ లో కొనసాగుతుండగా స్పిన్నర్లు జడేజా మరియు కుల్దీప్ యాదవ్ కూడా రాణిస్తున్నారు. ఇక వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ బౌలింగ్ విభాగం బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగం కెప్టెన్ బాబర్ అజామ్ , మహమ్మద్ రిజ్వాన్ , ఫాస్ట్ బౌలర్ షహిన్ షా హాఫ్రిది పైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఈ భారీ ఉత్కంఠత నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.