Low Budject Bikes : తక్కువ ధర… ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ … మనలాంటి సామాన్యులకు ఇంతకంటే ఏం కావాలి..

Low Budject Bikes  : భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా బైక్ బెస్ట్ జర్నీ వెహికల్ గా మారింది. ఇది ట్రాఫిక్ లో ప్రయాణించడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆఫీస్ కి కాలేజీకి ఎక్కడికి వెళ్ళినా సరే భారతదేశంలో బైక్ మించిన వాహనం లేదు. కానీ పెరుగుతున్న పెట్రోల్ ధర వల్ల ఇప్పుడు బైక్ లను కూడా సరిగా మెయింటైన్ చేయలేకపోతున్నారు సామాన్యులు. అయితే అతి తక్కువ ధరకు మంచి మైలేజ్ ఇచ్చే బైక్ […]

  • Published On:
Low Budject Bikes  : తక్కువ ధర… ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ … మనలాంటి సామాన్యులకు ఇంతకంటే ఏం కావాలి..

Low Budject Bikes  : భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా బైక్ బెస్ట్ జర్నీ వెహికల్ గా మారింది. ఇది ట్రాఫిక్ లో ప్రయాణించడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆఫీస్ కి కాలేజీకి ఎక్కడికి వెళ్ళినా సరే భారతదేశంలో బైక్ మించిన వాహనం లేదు. కానీ పెరుగుతున్న పెట్రోల్ ధర వల్ల ఇప్పుడు బైక్ లను కూడా సరిగా మెయింటైన్ చేయలేకపోతున్నారు సామాన్యులు. అయితే అతి తక్కువ ధరకు మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ల కోసం మధ్యతరగతి వారు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మేము అద్భుతమైన మైలేజ్ ఇచ్చి, అతి తక్కువ ధర కే లభించే బైక్ లను మీకోసం తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం….

బజాజ్ CT110X…

low-price-bikes-that-give-high-mileage

ఈ బండి యొక్క షోరూం ప్రైస్ చూసుకుంటే రూ. 67,332 గా ఉంది. ఇక ఈ బైక్ వైట్, బోనీ బ్లాక్, బ్లాక్ బ్లూ, కాంబినేషన్లో అందుబాటులో ఉంది.ఈ మోటార్ సైకిల్ ఎలక్ట్రానిక్ కార్పొరేటర్ తో వస్తుంది. తద్వారా దీని ఇంధన సామర్థ్యాన్ని గణనీయంగా మరియు మెరుగ్గా ఉంటుంది. ఇక ఈ మోటార్ సైకిల్ ఒక లీటర్ పెట్రోల్ కు 65kmpl మైలేజ్ ను ఇస్తుంది. ఈ మోటార్ సైకిల్ కు కంపెనీ 115.45 సిసి సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్ ఇంజన్ ను ఇస్తుంది. ఈ ఇంజన్ 8.6 ps శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ లతో వస్తున్న ఈ మోటార్ సైకిల్ గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని కంపెనీ చెబుతుంది.

TVS Sport…

low-price-bikes-that-give-high-mileage

టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ దాని లుక్ మరియు పనితీరు కారణంగా యువతలో అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ మోటార్ సైకిల్ కు కంపెనీ ఏకో ట్రస్ట్ ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీని అందించడం జరిగింది. ఇది మైలేజ్ ని పెంచేందుకు దోహాదపడుతుంది. ఇక ఈ మోటార్ సైకిల్ లీటర్ కు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ ధర విషయానికొస్తే రూ.64,050 ఎక్స్ షోరూం ధర ను కలిగి ఉంది. ఇక ఈ మోటార్ సైకిల్ 109.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూలింగ్ ఇంజన్ తో లభిస్తుంది. ఇక ఈ మోటార్ సైకిల్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Hero Hf 100…

low-price-bikes-that-give-high-mileage

మోటార్ సైకిల్ మైలేజ్ ప్రస్తావన వస్తే హీరో బైక్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ బైకులు ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు క్విక్ స్టార్ట్ తో లభిస్తాయి. ఇవి దాదాపుగా లీటర్ కు 65 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ను ఇస్తాయి. హీరో బైక్ లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి హీరో హెచ్ఎఫ్ మరొకటి హీరో డీలక్స్. హీరో హెచ్ఎఫ్ 100 ధర రూ. 54,962 గా ఉంది. హీరో డీలక్స్ ధర రూ. 60,308 గా ఉంది. ఇవి 97 సిసి సింగల్ సిలిండర్ ఎయిర్ కూలింగ్ ఇంజన్ తో వస్తున్నాయి.