Ola scooter : కోట్లు ఉన్న కొనలేని స్కూటర్..ఓలా స్పెషల్ ఎడిషన్..

Ola scooter : రంగుల పండుగ అయిన హోలీ సందర్భంగా ఓలా కంపెనీ ప్రత్యేకమైన స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఓలా సీఈఓ అయినా భవిష్ అగర్వాల్ ఆ స్కూటర్ యొక్క ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే హోలీ ఎడిషన్ పేరుతో తయారుచేసిన ఈ స్కూటర్ లను కోట్లు పెట్టిన సరే సొంతం చేసుకోవడం అసాధ్యమని తెలియజేశారు.కేవలం ప్రచారం కోసం మాత్రమే తయారు చేసిన ఈ స్కూటర్ ను దక్కించుకోవాలంటే, ఓలా స్కూటర్ కంపెనీ […]

  • Published On:
Ola scooter : కోట్లు ఉన్న కొనలేని స్కూటర్..ఓలా స్పెషల్ ఎడిషన్..

Ola scooter : రంగుల పండుగ అయిన హోలీ సందర్భంగా ఓలా కంపెనీ ప్రత్యేకమైన స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఓలా సీఈఓ అయినా భవిష్ అగర్వాల్ ఆ స్కూటర్ యొక్క ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే హోలీ ఎడిషన్ పేరుతో తయారుచేసిన ఈ స్కూటర్ లను కోట్లు పెట్టిన సరే సొంతం చేసుకోవడం అసాధ్యమని తెలియజేశారు.కేవలం ప్రచారం కోసం మాత్రమే తయారు చేసిన ఈ స్కూటర్ ను దక్కించుకోవాలంటే, ఓలా స్కూటర్ కంపెనీ నిర్వహిస్తున్న పోటీలో గెలుపొంది తీరాలట.

అలా పోటీ లో ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే స్కూటర్ దొరుకుతుందని, అంతేకాక పోటీలో నెగ్గిన సరే అదృష్టం మీకు తోడుగా లేకపోతే ఈ స్కూటర్ ను మీ ఇంటికి తీసుకెళ్లడం అసాధ్యమని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి.కోట్లు ఖర్చుపెట్టిన సరే కొనలేనంత, వందల వేల మందితో పోటీపడి నెగ్గిన సరే దక్కించుకోలేనంత ప్రత్యేకత ఈ స్కూటర్ లో ఏముందంటూ ప్రతి ఒక్కరిలో మెదులవుతున్న ప్రశ్న. అంత ప్రత్యేకత ఈ స్కూటర్లో ఏముందంటే.. ఓలా కంపెనీ కేవలం 5 అంటే 5 స్కూటర్ లను మాత్రమే తయారు చేయడం జరిగిందట. అంతేకాక ఈ స్కూటర్లను భవిష్యత్తులో తయారు చేసే అవకాశం లేకపోవడమే దీని ప్రత్యేకత అని కంపెనీ వర్గాలు తెలియజేశాయి.

అయితే హోలీ పండుగ సందర్భంగా ఓలా కంపెనీ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కంపెనీ స్పెషల్ ఎడిషన్ ను తీసుకువచ్చింది. స్కూటర్ కేవలం 5 స్కూటర్లను మాత్రమే తయారు చేయడం జరిగింది. కంపెనీ ప్రచారం కోసం పండగ తీమ్ తో పోటీ నిర్వహించడం జరిగింది. ఐదుగురు విజెతలను లాటరీ ద్వారా ఎంపిక చేసి స్కూటర్లను అందజేస్తున్నట్లు కంపెనీ తెలిసింది. అయితే పోటీ ఏంటంటే ఓలా స్కూటర్ ఎస్ 1 తో హోలీ వేడుకలు జరుపుకున్న ఫొటోస్ ను కంపెనీ యొక్క సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలి. ఇక వాటిలో అత్యుత్తమంగా భావించిన వాటిని ఎంపిక చేసి వాటిలో లాటరీ ద్వారా ఐదుగురు విజేతలను ఎంపిక చేసారు. పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు.