Viral News : అక్కతో నిశ్చితార్థం చేసుకుని చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు…అసలు నిజం తెలిసి అందరూ షాక్…

Viral News : బీహార్ రాష్ట్రంలో చప్రా నగరంలో జగన్మోహన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని కుమారుడు రాజేష్ కు స్థానిక నగరంలోనే నివసిస్తున్న రింకూ అనే అమ్మాయితో పెద్దల సమక్షంలో ఏడాది కిందట నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికూతురు రింకూ కు పుతుల్ అనే ఓ చెల్లి కూడా ఉంది. అయితే నిశ్చితార్థం తర్వాత వరుడు మరియు వధువు కుటుంబానికి మధ్య చనువు బాగా పెరిగింది. ఈ క్రమంలో రాజేష్ తరచుగా రింకూ ఇంటికి వచ్చి […]

  • Published On:
Viral News : అక్కతో నిశ్చితార్థం చేసుకుని చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు…అసలు నిజం తెలిసి అందరూ షాక్…

Viral News : బీహార్ రాష్ట్రంలో చప్రా నగరంలో జగన్మోహన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని కుమారుడు రాజేష్ కు స్థానిక నగరంలోనే నివసిస్తున్న రింకూ అనే అమ్మాయితో పెద్దల సమక్షంలో ఏడాది కిందట నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికూతురు రింకూ కు పుతుల్ అనే ఓ చెల్లి కూడా ఉంది. అయితే నిశ్చితార్థం తర్వాత వరుడు మరియు వధువు కుటుంబానికి మధ్య చనువు బాగా పెరిగింది. ఈ క్రమంలో రాజేష్ తరచుగా రింకూ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో పెళ్లికూతురు చెల్లి పుతుల్ కూడా రాజేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదట. రాజేష్ కూడా తనతో సన్నిహితంగానే మాట్లాడేవాడట. అప్పుడప్పుడు పుతుల్ ను బయటకు కూడా తీసుకెళ్లే వాడట.

the-groom-who-got-engaged-to-big-sister-and-married-his-small-sister-everyone-was-shocked-to-know-the-real-truth

అయితే రాజేష్ బాధ్యతగా ఉంటున్నాడని అందరూ అనుకున్నారు. కానీ వారిద్దరి మధ్య సన్నిహితం బాగా పెరిగిపోయింది. దీంతో వారిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. కానీ ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. ఇదిలా ఉండగా ఈనెల 2 తేదీన రాజేష్ పెళ్లి వేడుక గా తన కుటుంబంతో కలిసి ఊరేగింపుగా పెళ్లికూతురింటికి చేరుకున్నారు. పెళ్లికూతురు తరుపువాళ్ళు కూడా వారిని మేళ తాళాలతోఆహ్వానించారు. వచ్చిన వారిని ఇంట్లోకి తీసుకెళ్తుండగా ఈ పెళ్లిని ఆపండి అంటూ పుతుల్ అరవడం మొదలెట్టింది. అయితే పుతల్ సరదాగా ఆట పట్టిస్తుందని అందరూ అనుకున్నారు.  అయితే ఆ తర్వాత రాజేష్ తో అక్కకు పెళ్లి చేయకండి అతనిని నేనే చేసుకుంటా అంటూ రచ్చ చేసింది.

ఇది విన్న పెద్దలు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుకు సరదాకి ఓ హద్దు అంటూ ఉంటుందని సర్ది చెప్పడానికి చూశారు. తన మాటలు ఎవరు పట్టించుకోకపోవడంతో పుతుల్ అక్కడినుండి ఇంటి పైకి పరుగు తీసింది. రాజేష్ తో నాకు పెళ్లి చేయకపోతే పైనుండి దూకేస్తానంటూ బెదిరించింది. పుతుల్ నిజంగానే ఏమైనా చేసుకుంటుందని భయంతో పెద్దవాళ్లు ఆమెకు నచ్చచెప్పి కిందకు దింపారు. ఆ తర్వాత రాజేష్ కు ఆమెకు మధ్య జరిగిన వ్యవహారాన్ని తెలుసుకున్నారు. ఇక చేసేది ఏమీ లేక ముహూర్త సమయానికి రాజేష్ కు మరియు పుతుల్ కు వివాహం జరిపించారు. అయితే పెళ్లి ఇంట్లో జరిగిన రచ్చ తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా ఇరు కుటుంబాలు పోలీసులకు వివరణ ఇచ్చి అక్కడ నుండి పంపించారు. దీంతో ఈ న్యూస్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.