TCS : ప్రెషర్స్ కు టీసిఎస్ శుభవార్త… ఈ ఏడాది 44 వేల ఉద్యోగాలకు భర్తీ…

TCS : ఆర్థిక మంద్యంతో ఖర్చులను తగ్గించేందుకు టెక్ కంపెనీలు లే ఆప్స్ ప్రకటిస్తున్నాయి. గత సంవత్సరం ప్రారంభమైన ప్రారంభమైన ఎంప్లాయ్స్ యొక్క లె ఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉద్యోగం ఉంటుందా ,పోతుందా అన్న ఆలోచన అందరిలో మొదలైంది. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీల నియామక ప్రక్రియ చాలా మందగించింది. దీంతో దేశీయ దిగ్గజ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS ) ఫ్రెషర్స్ కు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. […]

  • Published On:
TCS : ప్రెషర్స్ కు టీసిఎస్ శుభవార్త… ఈ ఏడాది 44 వేల ఉద్యోగాలకు భర్తీ…

TCS : ఆర్థిక మంద్యంతో ఖర్చులను తగ్గించేందుకు టెక్ కంపెనీలు లే ఆప్స్ ప్రకటిస్తున్నాయి. గత సంవత్సరం ప్రారంభమైన ప్రారంభమైన ఎంప్లాయ్స్ యొక్క లె ఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉద్యోగం ఉంటుందా ,పోతుందా అన్న ఆలోచన అందరిలో మొదలైంది. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీల నియామక ప్రక్రియ చాలా మందగించింది. దీంతో దేశీయ దిగ్గజ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS ) ఫ్రెషర్స్ కు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. 2023 – 2024 ఆర్థిక సంవత్సరంలో భాగంగా క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

అంతేకాక ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ లను కూడా ఎక్కువ మొత్తంలో ఆన్ బోర్డులోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. టిసిఎస్ లో ఉద్యోగ వలసల రేటు చాలా ఎక్కువగా ఉండడంతో భారీగా ఫ్రెషర్స్ ను నియమించుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో వలసల రేటును తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లుగా టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక మంధ్యం పరిస్థితులలో ప్రెషర్లు ఉద్యోగం పొందడం చాలా కష్టంగా ఉంది. కానీ టిసిఎస్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొంత ఊరట లభించిందని చెప్పాలి.

ఇక ఈ విషయంపై టిసిఎస్ చీఫ్ ఎచ్ఆర్ ఆఫీసర్ మీలింద్ లక్కడ్ మాట్లాడుతూ… కంపెనీలో ఫ్రెషర్స్ యొక్క టాలెంట్ ను డెవలప్ చేయాలనుకుంటున్నామని, దానికి తగ్గట్టు ఈ సంవత్సరం 44 వేల మంది ఫ్రెషర్స్ ను తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే అవసరం మేరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని కూడా రిక్యూర్ చేసుకుంటామని ఆయన తెలియజేశారు. తద్వారా క్లైంట్స్ కు మెరుగైన సేవలు అందిస్తూ కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లే కృషి చేస్తామని ఆయన తెలియజేశారు.