Free Bus Service : ఉచిత బస్సు ప్రయాణం రద్దు…నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Free Bus Service : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ చక్కగా టిఎస్ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం వలన నెల నెలా మహిళలకు ఎంతో కొంత మిగులుతుందని చెప్పాలి. అదేవిధంగా ఊర్లకు వెళ్లాలి అనుకునే వారు ఉచిత ప్రయాణాలు చేస్తూ వారి గమ్యానికి చేరుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం బాగా మెలు చేస్తుందని చెప్పాలి. […]

  • Published On:
Free Bus Service : ఉచిత బస్సు ప్రయాణం రద్దు…నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Free Bus Service : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ చక్కగా టిఎస్ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం వలన నెల నెలా మహిళలకు ఎంతో కొంత మిగులుతుందని చెప్పాలి. అదేవిధంగా ఊర్లకు వెళ్లాలి అనుకునే వారు ఉచిత ప్రయాణాలు చేస్తూ వారి గమ్యానికి చేరుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం బాగా మెలు చేస్తుందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దు అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటి ఉచిత బస్సు ప్రయాణం రద్దు అవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా…? అవునండి నిజమే తెలంగాణ హైకోర్టులో తాజాగా గురువారం రోజు ఓ ప్రైవేట్ ఉద్యోగి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై పిటిషన్ వేయడం జరిగింది. నాగోల్ కు చెందిన ఈ ఉద్యోగి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన అనేక రకాల సమస్యలు వస్తున్నాయని , ఇది వివక్ష కిందకు వస్తుందని పిటిషన్ లో తెలియజేశారు.

కేంద్ర చట్టాల ద్వారా ఏర్పడిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని , కాబట్టి ఈ పథకాన్ని తక్షణమే ఆపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ ప్రైవేటు ఉద్యోగి పిటిషన్ లో తెలియజేశారు.అంతేకాక ఈ పిటిషన్ లో మరో అంశాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం కావడం వలన ,ల్చాలామంది మహిళలు అవసరం లేకపోయినా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని ,దీని కారణంగా అత్యవసర పరిస్థితులలో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు. అంతేకాక ఈ ఉచిత బస్సు ప్రయాణం వలన ఆర్టీసీ సంస్థ పై భారీ స్థాయిలో భారం పడుతుందని ఇలాంటి భారాలను ప్రభుత్వం ,ల్భరించాల్సిన అవసరం లేదంటూ ఆయన తెలిపారు.

అయితే ప్రైవేటు ఉద్యోగి అపిల్ చేసిన పిటిషన్ హైకోర్టు పరిఘనలొకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వారి నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా ఆదేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నిపుణులు మాత్రం ఈ పథకాన్ని రద్దు చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అని చెబుతున్నారు. ఎందుకంటే ఇది అసెంబ్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి…దీనిని రద్దు చేసే అవకాశం హైకోర్టుకు ఉండకపోవచ్చు అని అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనిని రద్దు చేసే అధికారం హైకోర్టుకు లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పథకాన్ని రద్దు చేసే ఉద్దేశం ఉండదు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి హైకోర్టు తన నిర్ణయాన్ని ఏ విధంగా తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే.