Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఆస్తి ఎంత ఉందో తెలుసా ?

Pawan Kalyan : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాలు చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ నీ కొనసాగిస్తున్నాడు పవన్. జనసేన పార్టీ పెట్టి 9 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటిదాకా ఒక పార్టీని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. రకరకాల వ్యాపారాలు వాటితో వచ్చే ఆదాయం తో వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే రాజకీయ పార్టీలను […]

  • Published On:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఆస్తి ఎంత ఉందో తెలుసా ?

Pawan Kalyan : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాలు చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ నీ కొనసాగిస్తున్నాడు పవన్. జనసేన పార్టీ పెట్టి 9 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటిదాకా ఒక పార్టీని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. రకరకాల వ్యాపారాలు వాటితో వచ్చే ఆదాయం తో వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే రాజకీయ పార్టీలను నడపగలరని ప్రజల్లో ఉన్న టాక్. కానీ పవన్ కళ్యాణ్ కోట్ల ఆస్తులు లేకపోయినా పార్టీ సమర్థవంతంగా నడుపుతూ పార్టీని నడపడం కోసం మరోవైపు సినిమాలు చేస్తూ ఉన్నాడు పవన్.

పవన్ కళ్యాణ్ ఆస్తులపై నాగబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని యాంకర్ అడగగా దానికి బదులుగా నాగబాబు ఏ సినిమా చేసిన వచ్చిన డబ్బుల్లో కొంత తనకోసం దాచుకొని, మిగతా డబ్బులు ప్రజలకే ఖర్చు పెట్టేస్తారని నాగబాబు అన్నారు. పార్టీ కోసం, మిలటరీ వాళ్ళ కోసం, ప్రజల కోసం, హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రజలకు విరాళంగా ఇస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో ఎవరికైనా కావాలంటే ఇస్తారు, ఇప్పుడు రైతుల కోసం ఇచ్చారు. తనకు చేతనైనంత అవతలి వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాడనీ నాగబాబు అన్నారు. తన దగ్గర ఏది ఉంచుకోరని సినిమాలో వచ్చే ఆదాయం తప్ప వేరే వ్యాపారాలు లేవని అన్నారు.

ప్రజల కోసం పోరాడే వ్యక్తికి ఆస్తులు ఉండకూడదని గొప్ప ఆలోచన పవన్ ది అని అన్నారు. సినిమా అయిపోతే పవన్ దగ్గర డబ్బులు ఉండవు. కావాలంటే మళ్ళీ సినిమా చేస్తారు మిగతా నాయకుల్లా ఏ వ్యాపారాలు లేవని అన్నారు. ప్రస్తుతం పవన్ ఉంటున్న ఇల్లు ఫైనాన్స లో ఉంది. శంకరపల్లి లో 15 లక్షలు ఖర్చుపెట్టి ఒక పొలం కొన్నారు అది కూడా వ్యవసాయం చేయడానికి కొన్నారు. అయితే ఆ ల్యాండ్ అంత పెద్ద ఆస్తి ఏమి కాదని అన్నారు. ఇక పవన్ కి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయని అన్నారు. ఇన్కమ్ టాక్స్ కూడా ఫైనాన్స్ చేసే కట్టారని, పవన్ కి వేల కోట్ల ఆస్తులు లేవని, ఉన్న కొద్ది ఆస్తులు ఫైనాన్షియల్ లోనే ఉన్నాయని నాగబాబు చెప్పుకొచ్చారు.

Must Read: Jayasudha :ఈ వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్న జయసుధ .. అతడేవరో కాదు ..