Viral Video : ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా సమయస్ఫూర్తితో ఆలోచించి తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో మీరే చూడండి….

Viral Video : అడవిలో నివసించే జంతువులు ప్రతిరోజు జీవన్మరణ పోరాటాన్ని ఎదుర్కోక తప్పదు. క్రూర జంతువులు శాఖాహార జంతువులను తినేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. కానీ పకృతిలో తమను తాము రక్షించుకునేందుకు ప్రతి జీవికి కూడా ఒక మెలకువ తెలిసి ఉంటుంది. బలం లేకపోయినా తెలివితేటలతో సమయానుకూలంగా స్పందించి అపాయాల నుండి తప్పించుకుంటాయి. అయితే అలాంటి జీవన్మరణ పోరాటానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో […]

  • Published On:
Viral Video : ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా సమయస్ఫూర్తితో ఆలోచించి తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో మీరే చూడండి….

Viral Video : అడవిలో నివసించే జంతువులు ప్రతిరోజు జీవన్మరణ పోరాటాన్ని ఎదుర్కోక తప్పదు. క్రూర జంతువులు శాఖాహార జంతువులను తినేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. కానీ పకృతిలో తమను తాము రక్షించుకునేందుకు ప్రతి జీవికి కూడా ఒక మెలకువ తెలిసి ఉంటుంది. బలం లేకపోయినా తెలివితేటలతో సమయానుకూలంగా స్పందించి అపాయాల నుండి తప్పించుకుంటాయి. అయితే అలాంటి జీవన్మరణ పోరాటానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే సింహం నుంచి తన ప్రాణాలను రక్షించుకునే క్రమంలో బబూన్ ( మరో రకమైన కోతి ) చేసిన ప్రయత్నం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

బబూనులకు మరియు సింహాలకు బద్ధ శత్రుత్వం ఉంటుంది. బబూన్ లకు పిల్ల సింహాలు కనిపిస్తే చాలు వాటిని కోరిక చంపేస్తాయి. అలాగే సింహాలు కూడా బబూన్ లు కనిపిస్తే చాలు వేటాడి చంపి తినేస్తాయి. అయితే సింహం కంట ఏది పడిన సరే అలాగే చేస్తుంది. ఎందుకంటే అది దానికి జన్మలక్షణం కాబట్టిి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ సింహాల గుంపు ఒక బబున్ ను టార్గెట్ చేశాయి. దీంతో బబూన్ వెంటనే సమీపంలో గల చెట్టు ఎక్కి చిటారు కొమ్మల్లో కూర్చుంది. అయితే అక్కడి వరకు సింహాలు రాలేవనేది దాని అంచనా. కానీ ఆ సింహాల గుంపులో ఒక సింహం దాన్ని ఎలాగైనా చెట్టు మీద నుండి కిందకు దింపేందుకు ఏకంగా చెట్టు ఎక్కసాగింది. ఇక అది కింద పడగానే పట్టుకునేందుకు మరో రెండు సింహాలు కింద వేచి చూస్తున్నాయి.

ఈ క్రమంలో చెట్టు ఎక్కిన సింహం చిట్టారు కొమ్మ వరకు వెళ్లి బబున్ ను భయపెట్టి కిందకు దూకేలా చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది. అయితే బబూన్ కు ఆ సింహాల ప్లాన్ అర్థమైందో ఏమో కానీ , అది ససమేరా కిందకు దిగలేదు. దానికి బదులుగా మరింత చివరకు వెళ్లి కొమ్మను పట్టుకుని వేలాడుతుంది. చెట్టుపైకి ఎక్కిన సింహం మాత్రం కొమ్మ చివరకు వెళ్లలేక పోతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు ముందు నుయ్యి వెనక గోయంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింహం అంతలా భయపెడుతున్న అదరక బెదరక అలాంటి విపత్కర పరిస్థితుల నుండి బయట పడేందుకు ట్రై చేసిన బబున్ తెలివితేటలకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Memol (@memol_wildlife_)