Viral news : అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వంటకాలకు ఆదరణ….వడాపావ్ ను రుచి చూసి ప్రశంసిస్తున్న జపనీస్ రాయబారి….

Viral news : భారతదేశంలోని స్ట్రీట్ ఫుడ్ అంటే విదేశాల వారు కూడా ఆసక్తి చూపిస్తారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ తినుబండారాలకు ప్రజాదరణ పొందాయి. భిన్నమైన రుచితో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే గోల్ గప్పాలు నోరూరించే పావ్ భాజీలు అంటే ఇష్టపడని వారే ఉండరు. ఇక ఇప్పుడు విదేశాల నుంచివచ్చిన వారు భారతదేశ స్ట్రీట్ ఫుడ్ ను తింటూ సోషల్ మీడియా వేదికగా వాటిని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల జపాన్ రాయబారి హీరోషి సుజుకి […]

  • Published On:
Viral news : అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వంటకాలకు ఆదరణ….వడాపావ్ ను రుచి చూసి ప్రశంసిస్తున్న జపనీస్ రాయబారి….

Viral news : భారతదేశంలోని స్ట్రీట్ ఫుడ్ అంటే విదేశాల వారు కూడా ఆసక్తి చూపిస్తారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ తినుబండారాలకు ప్రజాదరణ పొందాయి. భిన్నమైన రుచితో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే గోల్ గప్పాలు నోరూరించే పావ్ భాజీలు అంటే ఇష్టపడని వారే ఉండరు. ఇక ఇప్పుడు విదేశాల నుంచివచ్చిన వారు భారతదేశ స్ట్రీట్ ఫుడ్ ను తింటూ సోషల్ మీడియా వేదికగా వాటిని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల జపాన్ రాయబారి హీరోషి సుజుకి ట్విట్టర్ వేదికగా తన అనుభూతిని పంచుకుంటూ భారతీయ స్ట్రీట్ ఫుడ్ ను ప్రశంసించాడు.

హిరోసి సుజుకి మహారాష్ట్రలోని పూణే లో రోడ్ సైడ్ పెట్టి ఉన్న వడా పావ్ ను రుచి చూశాడు. అది తిన్న తర్వాత తాను ఆస్వాదించిన అనుభూతిని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. భారతీయ స్ట్రీట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టమని, కానీ కొంచెం మసాలా తగ్గించాలని కోరాడు. ఇక ఈ వీడియోని చూసిన ఫుడ్ లవర్స్ సంతోషిస్తున్నారు.

అంతేకాక తమ ప్రాంతంలోని తినుబండారాలను కూడా రుచి చూడాల్సిందిగా జపనీస్ రాయబారిని కోరారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్పందిస్తూ అనేక రకాల తినుబండారాలను సూచించారు. మరికొందరు పిలిస్తే మేము కూడా వస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు . హైదరాబాదులో మిర్చి బజ్జి, బికనీర్ , స్వీట్ లస్సి, మ్యాంగో మస్తానీ తప్పనిసరిగా ట్రై చేయండి అంటూ చెప్పుకొచ్చారు. మరి కొంతమంది అంతర్జాతీయ స్థాయిలో మన తినుబండారాలకు ఆదరణ ఉన్నందుకు గర్వంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.