Viral Video : యుద్ధభూమిని తలపిస్తున్న ఢిల్లీ మెట్రో రైలు….మొన్నటిదాకా డాన్సులు…ఇప్పుడేమో ఇలా… చీ..చీ..

Viral Video : కొన్నిసార్లు మహిళలు పెట్టుకునే గొడవలు చూస్తే నవ్వు వస్తుంది. మహిళలు గొడవ పడడం ప్రారంభిస్తే చుట్టు ఎవరు ఉన్న పట్టించుకోరు. ఇలాంటి గొడవలు పక్క పక్క ఇళ్లల్లో ఉండే మహిళలు, అలాగే వీధి కులాయిల వద్ద బిందెలతో కొట్టుకునే మహిళలను రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి గొడవలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటిదే ఇప్పుడు ఇద్దరు మహిళల గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో […]

  • Published On:
Viral Video : యుద్ధభూమిని తలపిస్తున్న ఢిల్లీ మెట్రో రైలు….మొన్నటిదాకా డాన్సులు…ఇప్పుడేమో ఇలా… చీ..చీ..

Viral Video : కొన్నిసార్లు మహిళలు పెట్టుకునే గొడవలు చూస్తే నవ్వు వస్తుంది. మహిళలు గొడవ పడడం ప్రారంభిస్తే చుట్టు ఎవరు ఉన్న పట్టించుకోరు. ఇలాంటి గొడవలు పక్క పక్క ఇళ్లల్లో ఉండే మహిళలు, అలాగే వీధి కులాయిల వద్ద బిందెలతో కొట్టుకునే మహిళలను రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి గొడవలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటిదే ఇప్పుడు ఇద్దరు మహిళల గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరు చెప్పు ,మరొకరు వాటర్ బాటిల్ పట్టుకొని గొడవ పడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైల్లో చోటు చేసుకుంది. అప్పటివరకు మహిళలతో పూర్తిగా నిండి ఉన్న మెట్రో రైల్లో ఒకసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య గొడవ ప్రారంభమైంది. దీంతో ఓ మహిళ తన షూ తీసుకుని దాడికి రాగా, మరో మహిళ తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ తో ఎదురు దాడికి వచ్చింది. ఇద్దరు మహిళలు ఎదురెదురుగా నిలబడి డీ అంటే డీ అంటూ తిట్టుకో సాగారు. దీంతో చుట్టూ ఉన్న మహిళలంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వారిలో కొందరు కలుగజేసుకొని వారిని పక్కకు లాగేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఇద్దరు మహిళలు ఎవరి మాట వినకుండా గొడవ పడుతూనే ఉన్నారు.

అలా కొద్దిసేపు గొడవ తర్వాత ఓ మహిళ బాటిల్లో నీళ్లను తన తోటి మహిళపై చల్లింది. దీంతో చుట్టూ ఉన్న వారంతా మనకెందుకు వచ్చిన గొడవలే అన్నట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇంకా తర్వాత ఏం జరిగిందనేది మాత్రం తెలియదు. ఒక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటిదాకా డాన్స్ వీడియోలు ఇప్పుడేమో ఇలా …ఢిల్లీ మెట్రో రైలు ఇలా వాడేస్తున్నారు ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం వీరి భర్తల పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.