E-Scooter :  ఫుజియామా స్కూటర్ కంపెనీ బంపర్ ఆఫర్.. 50 వేల కంటే తక్కువకే హైస్పీడ్ స్కూటర్..

E-Scooter : ఫుజియామా అనే స్టార్ అప్ కంపెనీ కొత్తగా ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక ఈ ఐదు స్కూటర్లలో నాలుగు లో స్పీడ్ తో నడిస్తే ఒకటి మాత్రం హై స్పీడ్ తో నడుస్తుంది. లో స్పీడ్ మోడల్స్ లో స్పెక్ట్రా , స్పెక్ట్రా ప్రో, వెస్పార్ , థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక స్పీడ్ మోడల్ కు ఓజోన్ ప్లస్ అని నామకరణం చేశారు. అంతేకాక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను […]

  • Published On:
E-Scooter :  ఫుజియామా స్కూటర్ కంపెనీ బంపర్ ఆఫర్.. 50 వేల కంటే తక్కువకే హైస్పీడ్ స్కూటర్..

E-Scooter : ఫుజియామా అనే స్టార్ అప్ కంపెనీ కొత్తగా ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక ఈ ఐదు స్కూటర్లలో నాలుగు లో స్పీడ్ తో నడిస్తే ఒకటి మాత్రం హై స్పీడ్ తో నడుస్తుంది. లో స్పీడ్ మోడల్స్ లో స్పెక్ట్రా , స్పెక్ట్రా ప్రో, వెస్పార్ , థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక స్పీడ్ మోడల్ కు ఓజోన్ ప్లస్ అని నామకరణం చేశారు. అంతేకాక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 140 కిలోమీటర్ల వరకు వస్తుంది.

* ఫుజియామా స్పెక్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ 250W , BLDC మోటర్ మరియు 1.56kWh లిథియం అయాన్ బ్యాటరీతో రానుంది. కంపెనీ అంచనా ప్రకారం దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడం వలన 90 కిలోమీటర్ల ప్రయాణించవచ్చని తెలుస్తోంది .

*స్పెక్ట్రా ప్రో విషయానికొస్తే 250W మోటార్ మరియు 1.34kWh బ్యాటరీతో లభిస్తుంది. ఇది కూడా స్పెక్ట్రా స్కూటర్ మాదిరిగానే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు వస్తుంది.

*వెస్పార్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే దీనిలో రిట్రో స్టైల్ డిజైన్ ఉంది. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ స్పెక్ట్రా మాదిరిగానే ఉంటుంది.

*ఇక థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెటప్ మరియు రేంజ్ స్పెక్ట్రా మోడల్ ను పోలి ఉంటుంది.

ఇక ఈ నాలుగు లోస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు డిటాచబుల్. అయితే కంపెనీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ స్కూటర్లను నాలుగు నుంచి ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ నాలుగు స్కూటర్లు ఎల్సిడి డిస్ప్లే తో పాటు ఎల్ఈడీ లైటింగ్ తో వస్తున్నాయి. అయితే ఈ నాలుగు స్కూటర్లు లోస్పీడ్ స్కూటర్లు కావడం వలన వీటిని నడపడానికి బండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు.

హై స్పీడ్ ఓజోన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్…

ఫుజియామా కంపెనీ నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త హై స్పీడ్ స్కూటర్, ఓజోన్ ప్లస్ , స్టైల్ పరంగా వెస్పార్ మోడల్ లుక్ తో వస్తుంది. లో స్పీడ్ స్కూటర్స్ తో పోలిస్తే దీని రేంజ్ మెరుగ్గా ఉంటుంది. దీనిలో 1.6W మోటర్ 60V/42AH లిథియం అయాన్ బ్యాటరీ ఉన్నాయి. ఈ స్కూటర్ లోని సెటప్ 3.7kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాపుగా 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే ఈ స్కూటర్లో ముందు మరియు వెనుక భాగాలలో డిస్కులు అమర్చబడి ఉన్నాయి. అలాగే దీనిలో ఎల్సిడి డేస్ ప్లే మరియు ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఈ ఫుజియామా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల విషయానికొస్తే రూ.49,499 నుండి మొదలై రూ.99,999 వరకు ఉన్నాయి.