Viral Video : నడివీధిలో ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన యువకుడు…వైరల్ వీడియో…

Viral Video : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మంచి ఫ్యూచర్స్ ఉన్న ఫోన్ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఏదైనా చక్కని సీన్ లేదా, వింతైన దృశ్యం కనిపిస్తే చాలు ఫోన్ కెమెరాతో దాన్ని బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలేజీ పిల్లలు తన ఇంటి ఎదురుగా చేస్తున్న దారుణమైన పనిని చూసిన ఓ వ్యక్తికి చెర్రెత్తిపోయింది. కొంచెం బిడియం కూడా లేకుండా పబ్లిక్ గా […]

  • Published On:
Viral Video : నడివీధిలో ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన యువకుడు…వైరల్ వీడియో…

Viral Video : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మంచి ఫ్యూచర్స్ ఉన్న ఫోన్ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఏదైనా చక్కని సీన్ లేదా, వింతైన దృశ్యం కనిపిస్తే చాలు ఫోన్ కెమెరాతో దాన్ని బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలేజీ పిల్లలు తన ఇంటి ఎదురుగా చేస్తున్న దారుణమైన పనిని చూసిన ఓ వ్యక్తికి చెర్రెత్తిపోయింది. కొంచెం బిడియం కూడా లేకుండా పబ్లిక్ గా తింగరి వేషాలు వేస్తున్న టీనేజర్లకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఆ వ్యక్తి టీనేజర్ చేసిన తింగర వేషాలు అన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయానికొస్తే..

ఓ టీనేజ్ కుర్రాడు ఇద్దరు అమ్మాయిలను ఓ సందులోకి తీసుకొని వచ్చి పబ్లిక్ గా సరసాలు ఆడుతున్నాడు. మొదటిగా కుర్రాడు ఓ యువతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతాడు. ఆ తర్వాత చేతులపై ఎత్తుకొని ఊయల ఊగించాడు. ఆ తర్వాత ఆమెను గట్టిగా హాగ్ చేసుకున్నాడు. రెండో అమ్మాయి తో కూడా ఇదే విధంగా రొమాన్స్ చేశాడు. అయితే ముగ్గురు చదువుకున్న విద్యార్థులు అయ్యుండి కూడా సభ్యత సంస్కారం లేకుండా నడివీధిలో ఇలా చేయడం చూసిన ఓ వ్యక్తికి ఆగ్రహం వచ్చింది. దీంతో తొలుత ఆ విద్యార్థులు చేస్తున్న వికృతి చేష్టలను కెమెరాలో రికార్డు చేశాడు. ఆ తర్వాత ఇంట్లోంచి ఓ బకెట్లో నిండా నీళ్లు తీసుకుని వచ్చి ఆ ముగ్గురిపై కుమ్మరించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ముగ్గురు విద్యార్థులు కంగుతిన్నారు.

వారు చేస్తున్న పనులన్నింటినీ పైనుంచి మరో వ్యక్తి గమనిస్తున్నారన్న విషయం వారికి అర్థమైంది. ఇంకా అక్కడే ఉంటే మరింత ప్రమాదం అని భావించిన ముగ్గురు వెంటనే అక్కడి నుండి పరుగు తీశారు. ఇద్దరమ్మాయిలు వెంటనే అక్కనుండి పరుగు తీయగా , యువకుడు తన స్కూటీని తోసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న యువకుడికి వ్యక్తి చెప్పులు కూడా విసిరేశారు. ఇక ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నేటిజనులు ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే వీరు హద్దులు మీరి ఇలా చేస్తున్నారంటూ వారి పై మండిపడుతున్నారు. ఈ తరం యువత ఎటు పోతుందో అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.