Sania Mirza :సానియా మీర్జాకు బిగ్ షాక్…

Sania Mirza : అనుకున్నదంతా అయ్యింది. ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నారు. కొద్దిసేపు కిందటే పెళ్లి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కి చెందిన నటి సన జావిద్ తో రాత్రి వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ ఫోటోలను ఉదయమే విడుదల చేశారు. షోయబ్ కు సోనియాకు మధ్య గ్యాప్ వచ్చిందని ఇద్దరు విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా చర్చ […]

  • Published On:
Sania Mirza :సానియా మీర్జాకు బిగ్ షాక్…

Sania Mirza : అనుకున్నదంతా అయ్యింది. ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నారు. కొద్దిసేపు కిందటే పెళ్లి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ కి చెందిన నటి సన జావిద్ తో రాత్రి వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ ఫోటోలను ఉదయమే విడుదల చేశారు. షోయబ్ కు సోనియాకు మధ్య గ్యాప్ వచ్చిందని ఇద్దరు విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈలోపే షోయబ్ మరో పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అయింది. సానియా మీర్జా ఇప్పటికే షోయబ్ మాలిక్ ఉన్న అన్ని జ్ఞాపకాలను చెడిపేస్తూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షోయబ్ ఫోటోలను అతనితో ట్యాగ్ చేసిన వీడియోలు డిలీట్ చేస్తూ వస్తున్నారు. దీనితో విడాకుల ప్రకటన వస్తుందని అందరూ భావించారు.

big-shock-for-sania-mirza

కాని ఈ ప్రకటన కు ముందే షోయబ్ మరో పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే 2010లో షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా పెళ్లి జరిగింది. అయితే సోనియా తో షోయబ్ కు అది రెండో పెళ్లి. సానియా మీర్జాను పెళ్లి ఆడే ముందే సోషిత్ అయధ్య సిద్ధికి విడాకులు ఇచ్చిన వెంటనే సానియా మీర్జాను వివాహమాడారు. ప్రస్తుతం సానియా మీర్జా సోయబ్ కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొద్దిరోజుల క్రితమే తన కొడుకుని మిస్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇది ఇలా ఉంటే షోయబ్ యొక్క పెళ్లి విషయం తెలిసిన తర్వాత సొనియా తన పేరుని మార్చుకున్నారు. అంతేకాక పెళ్లి , విడాకులు కష్టం మూడేసి ఉండడం కష్టం విడిగా ఉండడం కష్టం, అప్పులు చేయడం కష్టమే ఫైనాన్షియల్ క్రమశిక్షణగా ఉండడం కష్టమే అంటూ సానియా మీర్జా ఈ మధ్యన ట్విటర్ లో వెరైటీగా పోస్ట్ కూడా చేశారు.అప్పుడే సానియాకు షోయబ్ కు తెగిపోయిందని అంత భావించారు. ఇక ఇప్పుడు ఏకంగా షోయబ్ పెళ్లి ఫోటోలు బయటికి రావడంతో ఇక వారు విడిపోయారు అని క్లారిటీ వచ్చింది.