Gas Price : సామాన్యుడికి భారీ ఊరట…గ్యాస్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం…

Gas Price : ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లే లేదు. దేశంలోని ప్రతి ఇంట్లో కూడా ఎల్పిజి స్టవ్ వెలుగుతుంది. అయితే గ్యాస్ ఏజెన్సీల సమన్వయంతో గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నగరాన్ని బట్టి గ్యాస్ ధరలో మార్పు చేర్పులు ఉంటాయి. గతంలో రెండు మూడు ఏళ్లలో గ్యాస్ ధరలు బాగా పెరగడం తో సామాన్యుడి నెత్తి మీద పిడుగు పడినట్లు అయింది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర […]

  • Published On:
Gas Price : సామాన్యుడికి భారీ ఊరట…గ్యాస్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం…

Gas Price : ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లే లేదు. దేశంలోని ప్రతి ఇంట్లో కూడా ఎల్పిజి స్టవ్ వెలుగుతుంది. అయితే గ్యాస్ ఏజెన్సీల సమన్వయంతో గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నగరాన్ని బట్టి గ్యాస్ ధరలో మార్పు చేర్పులు ఉంటాయి. గతంలో రెండు మూడు ఏళ్లలో గ్యాస్ ధరలు బాగా పెరగడం తో సామాన్యుడి నెత్తి మీద పిడుగు పడినట్లు అయింది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాజకీయ పార్టీలు ఇదే అంశాన్ని కీలకంగా తీసుకుంటున్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరల నియంత్రణపై కేంద్రం తో పాటు పలు రాష్ట్రాలు కూడా కీలక అడుగులేస్తున్నాయి. పేద ప్రజలకు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు అందించే ప్రకటనలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని సామాన్యుడికి మేలు జరిగేలా గ్యాస్ ధరలపై మోడీ ప్రభుత్వం దృష్టిసారించిందని సమాచారం. త్వరలోనే ఎల్పీజి కి సంబంధించి భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్యాస్ ధరలు తగ్గించి పేద మధ్యతరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక దీనికి అర్హులైన పేద కుటుంబాలకు తక్కువ ధరకే ఎల్పిజి సిలిండర్లను మోడీ ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది. అయితే గత సంవత్సరం ఆగస్టు నెలలో కూడా గృహాలలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను అసలు ధరలో 200 రూపాయలు తగ్గించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తరువాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు 400 రూపాయల సబ్సిడీని అందుకుంటారు. అయితే ఇప్పుడు పేద కుటుంబాలకు సబ్సిడీ మొత్తాన్ని మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని అంటున్నారు. ఈ సబ్సిడీ 300 రూపాయల వరకు ఉండొచ్చు అని తెలుస్తుంది. దీనికి త్వరలోనే అధికార ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. ప్రస్తుతం దేశంలో ఎల్పిజి వినియోగదారులు సంఖ్యా దాదాపు 33 కోట్లు. గత ఏడాది 25- 26 నాటికి మరో 75 ఎల్పిజి కనెక్షన్లు ఆడ్ అవుతాయని అంచనాతో సబ్సిడీ అందించే సిలిండర్లపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వస్తుంది. ఈ మేరకు రాయితీ విషయంలో మార్పులను తీసుకురానుంది.