Sana Begum : నా కూతుర్ని దుబాయ్ తీసుకెళ్లి నరకం చూపించారు..ఆ డైరెక్టర్స్ గురించి అసలు నిజం బయటపెట్టిన సనా బేగమ్..

Sana Begum  : బుల్లితెర సీరియల్స్ లో మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా దాదాపుగా 600 పైగా చిత్రాల లో నటించింది సనా బేగమ్. అలాగే ఇటీవల రిలీజ్ అయిన రంగమార్తాండ సినిమాలో విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది. దీనిలో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియా ముందు చెప్పింది. అయితే మొట్టమొదటిగా తన ప్రయాణం యాడ్ షూటింగ్స్ నుంచి ప్రారంభమైంది. అంతేకాక ఆమె అత్తమామలు ఆమెకు బాగా సపోర్ట్ చేసినట్లు ఆమె […]

  • Published On:
Sana Begum : నా కూతుర్ని దుబాయ్ తీసుకెళ్లి నరకం చూపించారు..ఆ డైరెక్టర్స్ గురించి అసలు నిజం బయటపెట్టిన సనా బేగమ్..

Sana Begum  : బుల్లితెర సీరియల్స్ లో మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా దాదాపుగా 600 పైగా చిత్రాల లో నటించింది సనా బేగమ్. అలాగే ఇటీవల రిలీజ్ అయిన రంగమార్తాండ సినిమాలో విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది. దీనిలో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియా ముందు చెప్పింది. అయితే మొట్టమొదటిగా తన ప్రయాణం యాడ్ షూటింగ్స్ నుంచి ప్రారంభమైంది. అంతేకాక ఆమె అత్తమామలు ఆమెకు బాగా సపోర్ట్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇరుగుపొరుగు వాళ్ళు ఏంటి మీ కోడలు ఇలా చేస్తుంది ,బుర్కా కూడా వేసుకోవట్లేదు. అని ఎన్నో మాటలు అనేవారట. అయినా కూడా ఆ మాటలను లెక్కచేయకుండా వారి అత్తమామలు తనకు సపోర్ట్ గా నిలిచారట. అంతేకాక సనాకు హీరోయిన్ గా అవకాశాలు కూడా వచ్చాయట కాకపోతే పెళ్లయింది పిల్లలు , ఉన్నారని చెప్పవద్దు అన్నారు. అంతేకాక స్లిమ్ సూట్ వేసుకోవాలని , ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పడంతో ఆ అవకాశాలను తిరస్కరించినట్లు ఆమె తెలిపింది.

అలాగే కన్నడలో ఇతర భాష నటి నటులు పెద్దగా యాక్ట్ చేసేవారు కాదట. సైనిక అనే సినిమా షూటింగ్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే సీన్ ఉండగా, నేను నేర్చుకుని డైలాగ్స్ చెప్తుంటే డైరెక్టర్ వన్ మోర్ అంటూ సీరియస్ గా మాట్లాడే వాడని తెలిపింది . ఆ టైంలో వాళ్లు పిలిస్తేనే కదా నేను వెళ్లాను అలాంటప్పుడు నామీద ఎందుకు కోపగించుకోవడం అనిపించింది అని తెలిపారు .ఇక ఇటీవల కోవిడ్ తర్వాత ఆర్జీవి తీసిన వెబ్ సిరీస్ కోసం అనంతపూర్ వెళ్ళగా అక్కడ జారి కింద పడడంతో చేతికి ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేయడంతో మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని అలా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే నా కూతురికి కూడా చిన్న వయసులోనే సినిమా చాన్సులు వచ్చినప్పటికీ తనకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో వదిలేసిందని, ప్రస్తుతం ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుందని తెలిపింది.

నా కూతురికి పెళ్లి చేశాక ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. వారి కుటుంబం సభ్యులు ఆమెను దుబాయ్ కి తీసుకెళ్లి టార్చర్ చేశారు. సరిగా తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. తన డబ్బులు, బంగారం మొత్తం వాడుకుని చాలా కష్టపెట్టారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్న కూడా ఏనాడు నా కూతురు నాకు ఈ విషయం చెప్పలేదు. కానీ నాకు కొంచెం అనుమానం వచ్చి హారా తీయడంతో ఒక్కొక్కటిగా అన్ని నిజాలు బయటపడ్డాయి. నా చేతుల మీదగా నేను ఎన్నో పెళ్లిళ్లు చేశాను. వారంతా చాలా సంతోషంగా ఉన్నారు కానీ నా కూతురికి జీవితం ఇలా అయింది అని ఆమె మదనపడ్డారు. ఇక తన కూతురు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి విడాకులు తీసుకుందని, ఇప్పుడు 5 ఏళ్ళ తన పిల్లాడిని పోషిస్తూ ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తుందని సనా చెప్పుకొచ్చారు.

.