Samantha Tattoo : చెరిగిపోని చై జ్ఞాపకం…సమంత లేటెస్ట్ ఫోటోలో కనిపించిన టాటూ…
Samantha Tattoo : చాలా కాలం పాటు ప్రేమలో మునిగితేలొన సమంత నాగచైతన్య 2017లో పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ కపుల్ గా పేరు పొందిన ఈ జంట ఎవరు ఊహించిన విధంగా పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ తెలియవు కానీ […]
Samantha Tattoo : చాలా కాలం పాటు ప్రేమలో మునిగితేలొన సమంత నాగచైతన్య 2017లో పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ కపుల్ గా పేరు పొందిన ఈ జంట ఎవరు ఊహించిన విధంగా పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ తెలియవు కానీ 2021 అక్టోబర్ లో వీరు విడిపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. విడాకులు అనంతరం చై మరియు సమంత ఇద్దరు కూడా సినిమాలలో బిజీగా మారారు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళసాగారు. అయితే వీరిద్దరూ విడిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తిరిగి కలొస్తే బాగు అని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు.
ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఆమధ్య మాయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడిన సమంత విదేశాల్లో చికిత్స పొంది పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చింది. ఇంకా అప్పటినుండి వరుసగా సినిమాలను చేస్తూ వస్తుంది. అయితే సామ్ మరియు చై రిలేషన్ లో ఉన్నప్పుడు వారి పెళ్లి డేట్ ను టాటో వేపించుకున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే సమంత చై పేరును తన నడుము మీద టాటో వేపించుకుంది. అయితే కొన్ని రోజుల క్రితం రెడ్ శారీ కట్టుకుని దర్శనం ఇచ్చిన సమంత సోషల్ మీడియా వేదిక తన ఫోటోలు షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో చై పేరు కనిపించకపోవడంతో సమంత నాగచైతన్య గుర్తులను చెడిపేసిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక అదే నిజమని చాలామంది అనుకున్నారు.
అయితే ఎవరు ఊహించని విధంగా మళ్లీ ఇప్పుడు ఆ టాటో కనిపించిన ఫోటోలు సమంత పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా శనివారం రోజు హైదరాబాదులో మార్వెల్ రూపొందించిన మార్వెల్స్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సమంత పాల్గొనడం జరిగింది . ఇక ఈ వేడుకలలో భాగంగా సమంత స్టైలిష్ బ్లాక్ జాకెట్ మరియు జీన్స్ ధరించి అందర్నీ ఆకర్షించింది. అంతేకాక ఈ స్టైలిష్ లుక్ లో సమంత చేసిన ఫోటో షూట్స్ తాలుకు ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో గమనించినట్లయితే నడుము పై ఉన్న చై పేరు టాటూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో గతంలో కనిపించకుండా పోయిన టాటూ ఇప్పుడెలా ప్రత్యక్షమైందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే వీరు ఇద్దరు తిరిగి కలుస్తారన్న నమ్మకం అభిమానులలో మళ్లీ మొదలైంది.
View this post on Instagram