Pooja Hegde : గుంటూరు కారం నుండి అందుకే తప్పుకున్న….క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే…

Pooja Hegde : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పెద్ద బ్యానర్ పై సినిమాలు చేస్తున్నట్లు ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు. మరి ముఖ్యంగా రిపీట్ కాంబినేషన్ అయితే ఇక ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తుంటారు. దీంతో ఆ సినిమాలొ జరిగే ప్రతి విషయం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే కొన్నిసార్లు అనుకొని కారణాల వలన షూటింగ్ లేట్ కావడం, నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, వలన సినిమాలు కాస్త ఆలస్యం […]

  • Published On:
Pooja Hegde :  గుంటూరు కారం నుండి అందుకే తప్పుకున్న….క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే…

Pooja Hegde : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పెద్ద బ్యానర్ పై సినిమాలు చేస్తున్నట్లు ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు. మరి ముఖ్యంగా రిపీట్ కాంబినేషన్ అయితే ఇక ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తుంటారు. దీంతో ఆ సినిమాలొ జరిగే ప్రతి విషయం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే కొన్నిసార్లు అనుకొని కారణాల వలన షూటింగ్ లేట్ కావడం, నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, వలన సినిమాలు కాస్త ఆలస్యం అవుతుంటాయి. అయితే హీరో మరియు డైరెక్టర్ అంటే ఒక్క సినిమా చేస్తారు కానీ మిగతావారు అలా కాదు కదా, దీని కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేక కొందరు ప్రాజెక్టుల నుండి తప్పుకుంటారు . అయితే ఇప్పుడు ,గుంటూరు కారం సినిమాలో అదే జరిగింది .

thats-why-pooja-hegde-droped-guntur-karam

 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా ట్రీజర్ ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసింది. ఇక దీనిలో మహేష్ బాబు మాస్ లుక్ లో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే అంతకు ముందే త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన పూజ హెగ్డే మరియు యంగ్ హీరోయిన్ శ్రీలీల ను హీరోయిన్ గా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల దీనికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింటా చెక్కర్లు కొడుతుంది. గుంటూరు కారం సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా వస్తున్న వార్తలకు చిత్ర బృందం మరియు తమన స్పందించి అది వాస్తవం కాదని తెలియజేశారు.

thats-why-pooja-hegde-droped-guntur-karam

ఇక ఇప్పుడు హీరోయిన్ పూజ హెగ్డే సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పూజ హెగ్డే దీనిపై క్లారిటీ ఇచ్చిందట. అయితే ఈ విధంగా వస్తున్న వార్తలపై సినీ బృందం కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుండి తప్పుకున్నది నిజమే అంటూ టీం తెలియజేసింది. అయితే తెలుగు మరియు హిందీ సినిమాలతో మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే వరుస సినిమాల కారణం గా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ సంయుక్త మీనన్ ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీల కంటిన్యూ అవుతుంది.