Kurchi Thata Arrest : కటకటాల వెనుక కుర్చీ తాత…ఎందుకంటే..

Kurchi Thata Arrest : ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో ఒక పాట బాగా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అదే కుర్చీ మడత పెట్టిన సాంగ్… ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. ఈ పాటలో కుర్చీ తాత ఫేమస్ డైలాగ్ పెట్టి క్రియేట్ చేశారు. అయితే ఈ తాత యూట్యూబ్ లో ఎంత ఫేమస్ నో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ […]

  • Published On:
Kurchi Thata Arrest : కటకటాల వెనుక కుర్చీ తాత…ఎందుకంటే..

Kurchi Thata Arrest : ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో ఒక పాట బాగా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అదే కుర్చీ మడత పెట్టిన సాంగ్… ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. ఈ పాటలో కుర్చీ తాత ఫేమస్ డైలాగ్ పెట్టి క్రియేట్ చేశారు. అయితే ఈ తాత యూట్యూబ్ లో ఎంత ఫేమస్ నో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అతనిపై ఫిర్యాదు అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. యూట్యూబ్లో వీడియోలతో ఫేమస్ అయిన వైజాగ్ సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. కాలాపాషా అలియాస్ కుర్చీ తాత ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. వైజాగ్ సత్య స్వామి నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కుర్చీ తాత తన డబ్బు కాజేసి పారిపోయినట్టు ఇష్టం వచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని తాత బూతులు తిడుతున్నాడని సత్య చెప్పుకొచ్చాడు.అది తట్టుకోలేకె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైజాగ్ సత్య చెప్పుకొచ్చారు. ముందుగా తన కోసం గాలించి బుధవారం కుర్చీ తాతను అదుపులోకి తీసుకున్నట్లు వైజాగ్ సత్య వెల్లడించారు. కుర్చీ తాత డైలాగులు వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆయనని ఇంటికి పిలిపించుకొని ఆర్థిక సాయం కూడా చేశారు.అయితే ఇదంతా జరగడానికి వాయిదా సత్య సహాయం చేశాడట. అతని వల్లనే కూర్చి తాత తమన్ వరకు వెళ్లగలిగాడట. ఆ విషయాన్ని తాత స్వయంగా చెప్పాడు. కాని ఎందుకో తాతా చివరికి రివర్స్ అయ్యాడు. వైజాగ్ సత్య తనను మోసం చేశాడని చెప్పడం స్టార్ట్ చేశాడు.

అతను కనిపిస్తే నరికేస్తా చంపేస్తా అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అయితే నిన్నటి వరకు బాగానే ఉన్నా కుర్చీ తాత వైజాగ్ సత్య మధ్య గొడవ ఎందుకు వచ్చింది అంటే తమన్ ని మహేష్ ని కల్పించాలని కుర్చీ తాత పట్టుబట్టాడంట. అయితే అది సాధ్యం కాదు అంటూ వైజాగ్ సత్య తేల్చి చెప్పాడు. అప్పటినుండి మతి చెడిందని వైజాగ్ సత్య చెప్పుకు వచ్చాడు. జనవరి 12న మొదటిసారి వైజాగ్ సత్య ను బూతులు తిడుతూ కాలా పాషా యూట్యూబ్ వీడియోలు చేశారు.అప్పుడే ఫిర్యాదు చేయగా ఆ ఛానల్ వాళ్లు తిట్టమని చెప్తే తిట్టాను అని చెప్పాడట. ఆ తర్వాత వైజాగ్ సత్యను తిడుతూ వీడియోలు చేయడంతో సత్య పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పాడు. ఇక ఇదే విషయాన్ని కుర్చీ తాత ని అడిగితే చానల్స్ వారు మందు పోయించి తిట్టిస్తున్నారని చెప్తున్నాడట. దీంతో అతని బూతులు తట్టుకోలేక వైజాగ్ సత్య పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు.