Tamannaah Bhatia : ప్రముఖ ఆలయంలో తమన్నా భాటియా…కుటుంబ సభ్యులతో కలిసి…

Tamannaah Bhatia  : సినిమాలలో ఎంతో గ్లామరస్ గా కనిపించే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా……హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు , ఆచార వ్యవహారాలకు , ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె చేసే పనులు భగవంతుని పట్ల తనకి ఉన్న అపారమైన నమ్మకం మరియు భక్తి విశ్వాసాలను తెలియజేస్తాయి. ఇక ఈ కారణంగానే తమన్నా ఎప్పుడు తరచుగా దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రముఖ ఆలయాలలో కనిపించిన తమన్నా భాటియా తాజాగా తన కుటుంబ సభ్యులతో […]

  • Published On:
Tamannaah Bhatia : ప్రముఖ ఆలయంలో తమన్నా భాటియా…కుటుంబ సభ్యులతో కలిసి…

Tamannaah Bhatia  : సినిమాలలో ఎంతో గ్లామరస్ గా కనిపించే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా……హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు , ఆచార వ్యవహారాలకు , ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె చేసే పనులు భగవంతుని పట్ల తనకి ఉన్న అపారమైన నమ్మకం మరియు భక్తి విశ్వాసాలను తెలియజేస్తాయి. ఇక ఈ కారణంగానే తమన్నా ఎప్పుడు తరచుగా దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది.

tamannaah-bhatia-with-family-members-in-famous-temple

ఇప్పటికే ఎన్నోసార్లు ప్రముఖ ఆలయాలలో కనిపించిన తమన్నా భాటియా తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత గాంచిన కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే కామాఖ్య ఆలయంలో తమన్నా ప్రత్యేక పూజలు చేసింది.ఇక ఈ సందర్భంగా తమన్నా పసుపు రంగు చూడిదార్, మెడలో హారం, శాలువా, నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించి అందర్నీ ఆకర్షించింది.

tamannaah-bhatia-with-family-members-in-famous-temple

ఇక ఈ ఆలయంలో ఆమె అనుభూతి చెందిన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా తమన్నా షేర్ చేసింది. నా ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలు గడిపాను అంటూ కామాఖ్య టెంపుల్ విజిట్ ఫోటోలను తమన్నా సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

tamannaah-bhatia-with-family-members-in-famous-temple

అయితే తమన్నా భాటియా ఆలయాలను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈషా ఫౌండేషన్ లో జరిగిన శివరాత్రి , సంక్రాంతి ,లింగ బైరవి దేవి పూజల లో తమన్నా భాటియా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తన ధైనందిన జీవితంలో ధ్యానం ,యోగ ,ప్రాణాయామం ను ఒక భాగంగా తమన్నా చేర్చుకున్నారు.

tamannaah-bhatia-with-family-members-in-famous-temple

tamannaah-bhatia-with-family-members-in-famous-temple