Amala Paul : రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్…

Amala Paul : స్టార్ హీరోయిన్ అమలాపాల్ అంటే తెలుగు వారికి సైతం సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమలాపాల్ ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించి మెప్పించింది.ఇక ఈ సంవత్సరం అజయ్ దేవగన్ నటించిన బోల సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈరోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఈ కేరళ ముద్దుగుమ్మ రెండోసారి పెళ్లి చేసుకునేందుకు […]

  • Published On:
Amala Paul : రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్…

Amala Paul : స్టార్ హీరోయిన్ అమలాపాల్ అంటే తెలుగు వారికి సైతం సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమలాపాల్ ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించి మెప్పించింది.ఇక ఈ సంవత్సరం అజయ్ దేవగన్ నటించిన బోల సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈరోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఈ కేరళ ముద్దుగుమ్మ రెండోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తన ప్రియుడు జగత్ దేశాయ్ తో కలిసి త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతోంది.

star-heroine-ready-for-second-marriage-boyfriend-proposed-

ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది అమలాపాల్. ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేసింది. అమలాపాల్ మరియు ఆమె ప్రియుడు కలిసి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అమలాపాల్ కు తన లవర్ జగద్దేశాయ్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఓ రింగ్ ను తన చేతి వేలికి తొడిగాడు. అనంతరం ఒకరినొకరు  కౌగిలించుకున్నారు.

star-heroine-ready-for-second-marriage-boyfriend-proposed-

అనంతరం ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఇక ఈ వీడియోను జగత్ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్స్ చేస్తూ నా క్వీన్ ఓకే చెప్పింది. హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు అమలాపాల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గతంలో డైరెక్టర్ విజయ్ ను పెళ్ళాడిన అమలాపాల్ 2017లో విడాకులు తీసుకుంది. అనంతరం ఇప్పుడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కెందుకు సిద్ధమైంది.

 

View this post on Instagram

 

A post shared by Jagat Desai (@j_desaii)