Roshan Meka : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోషన్…..

Roshan Meka : హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటిగా రోషన్ ‘ నిర్మలా కాన్వెంట్ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ రోషన్ కి మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక రెండవ సినిమాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ పెళ్లి సందడి ‘ సినిమాలో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా యావరేజ్ […]

  • Published On:
Roshan Meka : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోషన్…..

Roshan Meka : హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటిగా రోషన్ ‘ నిర్మలా కాన్వెంట్ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ రోషన్ కి మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక రెండవ సినిమాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ పెళ్లి సందడి ‘ సినిమాలో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో రోషన్ కొంచెం గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించాలని ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకి బంపర్ ఆఫర్ వచ్చింది.

srikanths-son-roshan-get-a-bumper-offer

తాజాగా రోషన్ అదిరిపోయే ఆఫర్ ఒకటి పట్టేశాడు. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. మోహన్ లాల్ హీరోగా మలయాళం, తెలుగు బైలింగ్వల్ గా ఒకేసారి తెరకెక్కబోతున్న ‘ వృషభ ‘ లో కీలకమైన కొడుకు క్యారెక్టర్ పట్టేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇది ఫాదర్ ఎమోషన్ మీద నడిచే కథగా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తల్లిగా నటించబోతుంది. అలాగే కేజిఎఫ్ సినిమా విలన్ రామచంద్రరాజుని ఈ సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేశారు.

srikanths-son-roshan-get-a-bumper-offer

త్వరలోనే లండన్ లో షూటింగ్ జరుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న వృషభని ఎపిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పేర్కొంటున్నారు. జనతా గ్యారేజ్ సినిమాతో మోహన్ లాల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. ఇప్పుడు రోషన్ కు ఆ ఛాన్స్ దక్కింది. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అవకాశాలు రావడం చాలా అరుదు. మరి ఈ అవకాశాన్ని రోషన్ వినియోగించుకుంటాడో లేదో చూడాలి.