Sitara Ghattamaneni : తన మొదటి రెమ్యూనరేషన్ సేవా సంస్థలకు డొనేట్ చేసిన సితార ఘట్టమనేని…తండ్రిని మించిపోయిందిగా..

Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని అంటే దాదాపుగా ఇప్పుడు అందరికీ తెలుసు ..ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ పాపులారిటీని తెచ్చుకుంది ఈ స్టార్ కిడ్. మొదట యూట్యూబ్ ఛానల్ తో డాన్సర్ గా గుర్తింపు పొందిన సితార..సర్కారి వారి పాట సినిమాలో మహేష్ బాబుతో కలిసి స్టెప్పులేసి అలరించింది. ఆ తర్వాత ఫ్రోజెన్ 2 మూవీ కి తెలుగు వర్షన్ లో బేబీ ఎల్సా […]

  • Published On:
Sitara Ghattamaneni : తన మొదటి రెమ్యూనరేషన్ సేవా సంస్థలకు డొనేట్ చేసిన సితార ఘట్టమనేని…తండ్రిని మించిపోయిందిగా..

Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని అంటే దాదాపుగా ఇప్పుడు అందరికీ తెలుసు ..ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ పాపులారిటీని తెచ్చుకుంది ఈ స్టార్ కిడ్. మొదట యూట్యూబ్ ఛానల్ తో డాన్సర్ గా గుర్తింపు పొందిన సితార..సర్కారి వారి పాట సినిమాలో మహేష్ బాబుతో కలిసి స్టెప్పులేసి అలరించింది. ఆ తర్వాత ఫ్రోజెన్ 2 మూవీ కి తెలుగు వర్షన్ లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంది. ఇలా తనలో ఉన్న పలు రకాల టాలెంట్లను బయటపెడుతూ మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా దూసుకెళ్తోంది. అయితే ఇటీవల సితార పీఎంజే అనే జ్యువెలరీ కు అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

sitara-ghattamaneni-who-donated-her-first-remuneration-to-seva-sansthanam

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. అంతేకాక సితార నటించిన ఈ జ్యువెలరీ యాడ్ కు సంబంధించిన ఫోటోలను ఏకంగా న్యూయార్క్ నగరంలో , టైమ్స్ స్క్వేర్ బిల్డ్ బోర్డులో ప్రదర్శించారు. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మార్మోగింది. అయితే ఈ ప్రకటన కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుందని సమాచారం. అయితే సితార తన మొదటి పారితోషికాన్ని సేవా స్వచ్ఛంద కార్యక్రమాలకు డొనేట్ చేసినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇలా వస్తున్న వార్తల్లో నిజం ఉంది.

sitara-ghattamaneni-who-donated-her-first-remuneration-to-seva-sansthanam

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన ఫస్ట్ రెమ్యూనరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్త హల్ చల్ అయింది.అయితే తన మొదటి రెమ్యూనరేషన్ ఎం చేశారని అడగగా చారిటీకి డొనేట్ చేసినట్లు సీతార చెప్పింది. దీంతో ఈ వార్త విన్న నేటిజనులు మహేష్ అడుగుజాడల్లోనే సితార నడుస్తుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఓ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల కు ఉచిత గుండె ఆపరేషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫౌండేషన్ బాధ్యతలను మహేష్ బాబు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పుడు వారి కూతురు సితార కూడా వారి అడుగుజాడల్లో నడవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సితార పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by sitara 🍓 (@sitaraghattamaneni)