Malla Reddy : బిజినెస్ మాన్ సినిమా చూసి మంత్రి అయ్యాను…మల్లారెడ్డి …

Malla Reddy  : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి కబీర్ సింగ్ సినిమా చేశారు. ఇక అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో స్టార్ డైరెక్టర్స్ లిస్టులో సందీప్ రెడ్డి వంగ యాడ్ అయిపోయారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి యానిమల్ అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ […]

  • Published On:
Malla Reddy : బిజినెస్ మాన్ సినిమా చూసి మంత్రి అయ్యాను…మల్లారెడ్డి …

Malla Reddy  : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి కబీర్ సింగ్ సినిమా చేశారు. ఇక అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో స్టార్ డైరెక్టర్స్ లిస్టులో సందీప్ రెడ్డి వంగ యాడ్ అయిపోయారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి యానిమల్ అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదల కాబోతుండగా అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు సినీ బృందం.  ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాదులోని మల్లారెడ్డి కాలేజీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది.

i-became-a-minister-after-watching-the-movie-businessman-malla-reddy

అయితే ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథులుగా విచ్చేశారు. ఇక వీరితో పాటు మంత్రి మల్లారెడ్డి కూడా గెస్ట్ గా పాల్గొనడం జరిగింది. అయితే అక్కడున్న స్టార్ డైరెక్టర్స్, హీరోల కంటే కూడా మల్లారెడ్డి రావడం… మాట్లాడటం అందర్నీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే స్టేజ్ పైకి ఎక్కి యానిమల్ సినిమాకు మల్లారెడ్డి బెస్ట్ విషెస్ ను తెలియజేశాడు. అలాగే మహేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ బిజినెస్ మాన్ సినిమా చాలాసార్లు చూశానని ఆ సినిమా చూసిన తర్వాత నేను పాలిటిక్స్ లోకి వచ్చాను అని చెప్పారు. ఆ సినిమా చూస్తున్న నేను ఇప్పుడు మంత్రిగా ఎదిగానంటూ మల్లారెడ్డి అన్నారు.

దీంతో మల్లారెడ్డి మాటలు విన్న మహేష్ బాబు కూడా కాస్త నవ్వుకున్నారు. అనంతరం రాజమౌళి గురించి మాట్లాడుతూ తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లారని మల్లారెడ్డి కొనియాడారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికీ మల్లారెడ్డి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.