Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇక లేరు…

Chandra Mohan : తెలుగు సినీ ఇండస్ట్రీ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. అయితే చంద్రమోహన్ గారికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. హీరోగా ,హాస్యనటుడు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు 975 సినిమాలలో నటించారు. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడి ముక్కల గ్రామంలో […]

  • Published On:
Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇక లేరు…

Chandra Mohan : తెలుగు సినీ ఇండస్ట్రీ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. అయితే చంద్రమోహన్ గారికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. హీరోగా ,హాస్యనటుడు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు 975 సినిమాలలో నటించారు. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడి ముక్కల గ్రామంలో చంద్రమోహన్ గారు జన్మించారు.

senior-actor-chandramohan-is-no-more

రంగులరాట్నం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చంద్రమోహన్ హీరోగా 175 సినిమాలలో నటించడం జరిగింది. ఇక ఆయన కెరియర్ పరంగా చూసినట్లయితే సినీ ఇండస్ట్రీలో మొత్తం 932 సినిమాలు చేయడం జరిగింది. ఇక 1987లో చందమామ అనే సినిమాకు సహాయ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. అలాగే పదహారేళ్ళ వయసు అనే సినిమాలో చంద్రమోహన్ కు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. అలాగే 2005లో నటించిన అతనొక్కడే సినిమాకి నంది అవార్డు కూడా అందుకున్నారు.

senior-actor-chandramohan-is-no-more
ఆయన నటించిన తొలి సినిమాకి నంది అవార్డు దక్కించుకుని రికార్డ్ కూడా సృష్టించారు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో చంద్రమోహన్ కు మంచి సెంటిమెంట్ కూడా ఉంది. ఆయనతో తొలిసారిగా నటించిన ఏ హీరోయిన్ అయినా సరే తిరుగులేని స్టార్ గా ఎదుగుతారని సెంటిమెంట్ ఉండేది. ఈ సెంటిమెంట్ నిజం చేస్తూ ఆయనతో తొలిసారి నటించిన ఎంతో మంది హీరోయిన్స్ తిరుగులేని స్టార్స్ హీరోయిన్లు గా ఎదిగారు. ఏది ఏమైనప్పటికీ మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.