Chaitu Vs Sam : టార్చర్ టైం అంటున్న సమంత…ఎలాంటి బాధలు లేవంటున్న చైతూ..అసలు కథ ఏంటి..?

Chaitu Vs Sam : అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న తర్వాత చైతు ఏమో గాని సమంత మాత్రం చాలా సందర్భాలలో వారి బంధంపై మండిపడింది. ఇద్దరినీ ఒక్క గదిలో ఉంచితే మాత్రం చుట్టుపక్కల కత్తులు కటార్లు లేకుండా చూసుకోవాలంటూ చాలా షోలలో సామ్ చెప్పుకొచ్చింది. ఇక అప్పటినుండి వీరిద్దరు విడిపోవడానికి పెద్ద కారణమే ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ కారణం ఏంటనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికి […]

  • Published On:
Chaitu Vs Sam : టార్చర్ టైం అంటున్న సమంత…ఎలాంటి బాధలు లేవంటున్న చైతూ..అసలు కథ ఏంటి..?

Chaitu Vs Sam : అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న తర్వాత చైతు ఏమో గాని సమంత మాత్రం చాలా సందర్భాలలో వారి బంధంపై మండిపడింది. ఇద్దరినీ ఒక్క గదిలో ఉంచితే మాత్రం చుట్టుపక్కల కత్తులు కటార్లు లేకుండా చూసుకోవాలంటూ చాలా షోలలో సామ్ చెప్పుకొచ్చింది. ఇక అప్పటినుండి వీరిద్దరు విడిపోవడానికి పెద్ద కారణమే ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ కారణం ఏంటనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికి కూడా వీరి చర్యలు ఒకరినొకరు రెచ్చగొడుతున్నట్లుగా అనిపిస్తుంటాయి. సమంత సినిమా రిలీజ్ టైం లో చైతు కామ్ గా ఉన్నట్టే కనిపిస్తాడు కానీ అతని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో సమంతపై కౌంటర్స్ వేస్తారు. అయితే ఇదంతా చైతుకు తెలిసే జరుగుతున్నట్లు సమంత భావిస్తుంది. అంతేకాక ఇటీవల సమంత తీసిన శాకుంతలం సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం చైతూ అనేలా కొన్ని వార్తలు కూడా వినిపించాయి.

samantha-says-torture-time-chaitu-says-no-pain-what-is-the-real-story

అయితే ఇప్పుడు చైతు సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సమంత రీవెంజ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. నాగచైతన్య మరియు వెంకట ప్రభు కాంబినేషన్లో రాబోతున్న సినిమా కస్టడీ.. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన తెలుగు తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు . ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహిస్తుంది.దీనిలో భాగంగా నాగచైతన్య పలువు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ… నా లైఫ్ లో ఇప్పటివరకు బాధాకరమైన సంఘటనలు ఏమీ లేవు..నేను ఎదుర్కొన్న ప్రతి సంఘటన నుండి ఒక పాఠం నేర్చుకుంటున్నా. కానీ కొన్ని సినిమా సినిమా కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయానని ఆ సినిమాలతో ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టానేమో అని బాధపడుతుంటాను. ముఖ్యంగా ఇలాంటిది ఓ మూడు సినిమాల విషయంలో జరిగిందంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు.

samantha-says-torture-time-chaitu-says-no-pain-what-is-the-real-story

అయితే నాగచైతన్య మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా సమంత తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టును షేర్ చేసింది. టార్చర్ టైం , ఐస్ బాత్ రికవరీ అంటూ సామ్ రాసుకు వచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సమంత ఈ పోస్ట్ ను తనకున్న వ్యాధి రికవరీ గురించి చేసిందా…? లేక తను నటించబోతున్న సీటాడేల్ వెబ్ సిరీస్ కోసం చేసిందా అనేది స్పష్టత లేదు. అంతేకాక ఈ పోస్టులో యాక్షన్ మోడ్ ఆన్ అంటూ రెండు బాంబు ఎమోజీలను కూడా సమంత జత చేసింది. దీంతో ఈ పోస్ట్ కచ్చితంగా చైతన్య ను ఉద్దేశించి చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చైతు ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత ఇలా పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సమంత రీసెంట్గా చెవులలో జుత్తు అంటూ ఇన్ డైరెక్ట్ గా కొందరిని ఆడుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కూడా అలాగే చేసి ఉంటుందని కొందరు అనుకుంటున్నారు.