Salman Khan : సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో ఫాన్స్ రచ్చ…థియేటర్లో టపాసుల మోత…వీడియో వైరల్.

Salman Khan  : ప్రస్తుతం థియేటర్లలో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు సినిమాల కంటే కూడా సల్మాన్ టైగర్ 3 సినిమా బాగా నడుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సల్మాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా టైగర్ 3 నిలిచిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక సల్మాన్ నటించిన ప్రేమ్ రతన్ కి ధన్ పాయో , భారత్ , కిసీ కా బాయ్ […]

  • Published On:
Salman Khan  : సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో ఫాన్స్ రచ్చ…థియేటర్లో టపాసుల మోత…వీడియో వైరల్.

Salman Khan  : ప్రస్తుతం థియేటర్లలో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు సినిమాల కంటే కూడా సల్మాన్ టైగర్ 3 సినిమా బాగా నడుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సల్మాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా టైగర్ 3 నిలిచిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక సల్మాన్ నటించిన ప్రేమ్ రతన్ కి ధన్ పాయో , భారత్ , కిసీ కా బాయ్ కిసికి జాన్ సినిమాల కంటే కూడా టైగర్ 3 సినిమా ఓపెనింగ్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 99 కోట్లను కొల్లగొట్టినట్లుగా సమాచారం.

salman-khans-tiger-3
ఇక టైగర్ 3 సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే థియేటర్లలో ఫ్యాన్స్ సందడి విపరీతంగా సాగుతుంది. బయట బాణ సంచాలు కాల్చడం డప్పుల మూతలతో ఫస్ట్ రోజు షో ని ఎంజాయ్ చేయడం అంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో కొందరు అభిమానులు అయితే ఏకంగా థియేటర్ లోపల హాంగమా చేస్తున్నారు. అభిమానులు చేసే రచ్చకు థియేటర్లు ధ్వంసం అవుతున్నాయి. తెరలు చిరిగిపోవడంతో పాటు సీట్లు కూడా విరిగిపోతున్నాయి. అయితే తాజాగా టైగర్ 3 సినిమాకు థియేటర్లో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ హంగామా చేశారు.

ఏకంగా థియేటర్లోనే టపాసులు కాల్చి జనాలను భయాందోళనకు గురి చేశారు. దీంతో ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై తాజాగా సల్మాన్ ఖాన్ సైతం మండిపడ్డారు. ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ థియేటర్ లో క్రాకర్స్ కాల్చిన ఘటన నాకు తెలిసిందని , అలాంటి పనులు చేయకండి అది చాలా ప్రమాదకరమంటూ సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. హాయిగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడండి అంటూ ఫ్యాన్స్ కు మంచి మాటలు చెప్పారు సల్మాన్ ఖాన్.