Prabhas : ప్రభాస్ అభిమానులకు సలార్ షర్ట్స్…ధర ఎంతో తెలుసా…

Prabhas  : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా చలామని అవుతూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సాధించుకున్న ప్రభాస్ త్వరలోనే పెద్దపెద్ద ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న పెద్ద ప్రాజెక్టు లలో సలార్ సినిమా […]

  • Published On:
Prabhas : ప్రభాస్ అభిమానులకు సలార్ షర్ట్స్…ధర ఎంతో తెలుసా…

Prabhas  : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా చలామని అవుతూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సాధించుకున్న ప్రభాస్ త్వరలోనే పెద్దపెద్ద ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న పెద్ద ప్రాజెక్టు లలో సలార్ సినిమా కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తేరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

salar-shirts-for-prabhas-fans-do-you-know-the-price

ఇక డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ డిసెంబర్ 22 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే విడుదల కాబోతున్న సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మూవీ మేకర్స్ మొదలు పెట్టడం జరిగింది. ఇక సినిమా అప్డేట్ ఎప్పుడు విడుదల చేస్తారు అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు సలార్ టీం తాజాగా ఒక శుభవార్త తెలియజేసింది.

salar-shirts-for-prabhas-fans-do-you-know-the-price

అయితే తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ దానికి సంబంధించిన టీ షర్ట్లు ,షర్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఆర్ఆరఆర్ షర్ట్స్ కూడా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయ్యాయి. ఇక ఇప్పుడు సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సినీ బృందం సలార్ టీషర్ట్స్ అందుబాటులోకిి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం సలార్ సినిమాకు సంబంధించిన షర్ట్స్ మార్కెట్లో రకరకాల కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు 499 నుండి 1499 వరకు ఈ టీ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.