Roja : బర్త్డే పార్టీలో రోజా అదిరిపోయే డాన్స్…కొడుకుతో కలిసి ఆ పాటకి…

Roja : ఏపీ పర్యటక శాఖ మంత్రి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని డోంట్ స్టాప్ డాన్సింగ్ పునకాలు లోడింగ్ అనే పాటకు రోజా వేసిన డాన్స్ అదిరిపోయింది. అంతేకాక ఇదే పార్టీలో తన కొడుకుతో కలిసి ముక్కాల పాటకు కూడా రోజా డాన్స్ చేశారు. పిల్లలతో కలిసి రోజు తన పుట్టినరోజు వేడుకలను […]

  • Published On:
Roja : బర్త్డే పార్టీలో రోజా అదిరిపోయే డాన్స్…కొడుకుతో కలిసి ఆ పాటకి…

Roja : ఏపీ పర్యటక శాఖ మంత్రి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని డోంట్ స్టాప్ డాన్సింగ్ పునకాలు లోడింగ్ అనే పాటకు రోజా వేసిన డాన్స్ అదిరిపోయింది. అంతేకాక ఇదే పార్టీలో తన కొడుకుతో కలిసి ముక్కాల పాటకు కూడా రోజా డాన్స్ చేశారు. పిల్లలతో కలిసి రోజు తన పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ వేడుకలకు సినీ సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయవేత్తలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో సన్నిహితులతో కలిసి రోజా తన పుట్టినరోజు వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకుంది.

Roja : కొడుకుతో రోజా ఊర మాస్ డాన్స్… ఏమన్న చేసారా… వీడియో!!!

ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక వీటిలో రోజా చేసిన డాన్స్ హైలెట్ గా నిలిచింది.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో కుమారుడు లోహిత్ సెల్వమణి తో కలిసి రోజా ముక్కాల ముకాబుల పాటకు అదిరిపోయేలా డాన్స్ చేశారు. ఇక ఈ వీడియోలు చూసిన నేటిజనులు పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు రోజాకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Minister Roja Selvamani Son Koushik Birthday Day Celebrations 2023.. - YouTube

ఇకపోతే ఒకప్పుడు రోజా స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ను ఏలిన విషయం అందరికీీ తెలిసిందే. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కన్నడ తమిళ్ మలయాళం వంటి భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో రోజా నటించారు. అయితే రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజా నగరి నియోజకవర్గం నుండి రెండు సార్లు, శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇక 2022లో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యటక క్రీడల యువజన మంత్రిగా రోజా వ్యవహరిస్తున్నారు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ షోలో ఎక్కువగా కనిపించిన రోజా మంత్రి అయినందుకు ఇకపై టీవీ షోలు చేయనంటూ ప్రకటించారు.