Viral News : టి అమ్ముతున్న రజనీకాంత్…అందరూ చూసి షూటింగ్ అనుకున్నారు కానీ..
Viral News : తమిళ్ తలైవా రజినీకాంత్ యావత్ భారతదేశానికి పరిచయమే అక్కర్లేని పేరు.దేశవ్యాప్తంగా రజనీకాంత్ కు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అయితే తాజాగా కేరళలో టీ అమ్ముతూ రజినీకాంత్ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే. నిజంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ టి […]
Viral News : తమిళ్ తలైవా రజినీకాంత్ యావత్ భారతదేశానికి పరిచయమే అక్కర్లేని పేరు.దేశవ్యాప్తంగా రజనీకాంత్ కు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అయితే తాజాగా కేరళలో టీ అమ్ముతూ రజినీకాంత్ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే. నిజంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ టి అమ్ముతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే రోడ్డు పక్కనే ఓ వ్యక్తి నిలబడి నీలం రంగు చొక్కా, షాట్ ధరించి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు.
అయితే అతని తలకట్టు రూపం అచ్చం రజనీకాంత్ లాగా ఉండడంతో ఆయనని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మొదట ఇతనిని చూసినవారు నిజంగానే రజినీకాంత్ షూటింగ్ మీద ఇక్కడ ఉన్నారేమో అనుకుంటారు. అంతేకాక ,ఆయన పక్కనే బాడీబిల్డర్స్ కనిపించడంతో అందరూ అతను నిజంగానే రజినీకాంత్ అనుకున్నారు. వారితో మాట్లాడుతూ అతను రెండు చేతులతో జుట్టును సరిచేసుకునే విధానం, తర్వాత సెకండ్ ఇవ్వడం భలే సరదాగా అనిపించింది. అయితే ఈ వీడియో చూసిన వారంతా మొదట ఏదో షూటింగ్ లో భాగమై ఉంటుంది అనుకున్నారు.
కానీ అసలు విషయం ఏంటంటే అతను అసలు సూపర్ స్టార్ రజినీకాంత్ కాదు. అచ్చం ఆయనలాగే పొలి ఉన్న మరో వ్యక్తి మాత్రమే. కానీ సడన్ గా చూసినవారు ఆయనని రజనీకాంత్ అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.రజనీకాంత్ తో చాలా దగ్గర పోలికలు ఉండడంతో అతనిని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.అయితే ఇతను కొచ్చి లో టీ దుకాణం పెట్టుకుని టీ అమ్ముతుంటాడట. ఇక ఆయన పేరు సుధాకర్ ప్రభు. కొచ్చి లోని వెంకటేశ్వర హోటల్ కు ఇతను ఓనర్. ప్రస్తుతం ఈయన రజిని రూపంతో కనిపించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయారు.
இவர் எளிமையான மனிதர்னு சொல்லுவானுங்க ஆனா இவளோ எளிமையானவரான்னு இப்ப தான் ஆச்சர்ய படுறேன்…. pic.twitter.com/pIbxiVYlpX
— 🔥 DESPOTER 🔥 (@despoters_12345) October 20, 2023