Allu Sirish : ఆ విషయంలో ఎన్టీఆర్ అన్న చాలా గ్రేట్..అల్లు శిరీష్ సంచలన కామెంట్స్…

Allu Sirish : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” సినిమాలో చాలా బిజీగా ఉంటున్నారు . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే హీరోగా సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం సెలబ్రిటీల కార్యక్రమాలలో పలు ఫంక్షన్స్ లో […]

  • Published On:
Allu Sirish : ఆ విషయంలో ఎన్టీఆర్ అన్న చాలా గ్రేట్..అల్లు శిరీష్ సంచలన కామెంట్స్…

Allu Sirish : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” సినిమాలో చాలా బిజీగా ఉంటున్నారు . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే హీరోగా సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం సెలబ్రిటీల కార్యక్రమాలలో పలు ఫంక్షన్స్ లో పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేస్తూ కనిపిస్తావు.

ntr-is-very-great-in-that-regard-allu-shirishs-sensational-comments

ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ లో తారక్ పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక దీపావళి పండగను పురస్కరించుకున్న తర్వాత మెగా హీరో రామ్ చరణ్ ఇంట్లో పలువురు హీరోలు కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో చిరంజీవి స్నేహితులతో పాటు రామ్ చరణ్ ఉపాసన అలాగే పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యారు. ఇక ఈ పార్టీలో అల్లు శిరీష్ కూడా పాల్గొని ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగారు. ఇక ఆ ఫోటోలను తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెబుతూ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే తన ఎక్స్ ఖాతా ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ…ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా సరే తనతో ఒక ఫోటో దిగాలని అడిగితే తారక్ అన్న అందరితో ఒకే లాగా ఉంటారు. అడిగిన వారికి ప్రేమతో ఒక ఫోటో ఇస్తారు. తారక్ అన్న చాలా ప్రేమ ఉన్న మనిషి అంటూ అల్లు శిరీష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.దీంతో ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికొస్తే ఊర్వశివో రాక్షసివో సినిమా తర్వాత అల్లు శిరీష్ ఇంతవరకు వెండితెరపై కనిపించలేదు. ఇప్పుడు అల్లు శిరీష్ ఏం చేస్తున్నారు అనే విషయాలు ఎవరికీ తెలియదు కానీ సరైన సినిమాల కోసం ఎదురుచూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.