Naresh – Pavitra Lokesh : పిల్లల్ని కనడంపై క్లారిటీ ఇచ్చిన నరేష్ పవిత్ర లోకేష్…త్వరలోనే శుభవార్త చెబుతామంటూ…

Naresh – Pavitra Lokesh  : సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నారు. అయితే వారు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో సమాజానికి తెలిసేలా చేసేందుకు “మళ్లీ పెళ్లి” అనే సినిమాను తెరకెక్కించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా […]

  • Published On:
Naresh – Pavitra Lokesh : పిల్లల్ని కనడంపై క్లారిటీ ఇచ్చిన నరేష్ పవిత్ర లోకేష్…త్వరలోనే శుభవార్త చెబుతామంటూ…

Naresh – Pavitra Lokesh  : సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నారు. అయితే వారు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో సమాజానికి తెలిసేలా చేసేందుకు “మళ్లీ పెళ్లి” అనే సినిమాను తెరకెక్కించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నరేష్-పవిత్ర లోకేష్ మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేలా తెలిసింది.

naresh-pavitri-lokesh-gave-clarity-on-having-children-saying-that-he-will-tell-the-good-news-soon

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ కి వెళ్తున్న ఈ జంట బోల్డ్ కామెంట్స్ తో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సహజంగా సెలబ్రిటీలు వారి వ్యక్తిగత జీవితాలలో జరిగే వాటి గురించి బయటకు చెప్పాలంటే భయపడతారు. కానీ నరేష్ పవిత్ర మాత్రం అన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇక ఇప్పుడు వారి పెళ్లి విషయమే కాకుండా..పిల్లలు కనడం పై వారికి గల అభిప్రాయం ఏంటో కూడా అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఇప్పుడు కూడా పవిత్రతో కలిసి పిల్లలు కనడంలో ఎలాంటి తప్పు లేదని నరేష్ చెబుతున్నాడు.

naresh-pavitri-lokesh-gave-clarity-on-having-children-saying-that-he-will-tell-the-good-news-soon

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ…నేను పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉన్నామని, ఇప్పుడు కూడా మేము మెడికల్ గా పిల్లలను కనవచ్చని నరేష్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇప్పుడు మేము పిల్లల్ని కంటే నాకు 80 సంవత్సరాలు వచ్చేసరికి నా బిడ్డకు 20 ఏళ్లు మాత్రమే వస్తాయని…అలా అవసరమా..? అందుకే భార్యాభర్తలుగా కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలను నా పిల్లలను మా బిడ్డలే అనుకుంటాం అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు.దీంతో ప్రస్తుతం నరేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వయసులో పిల్లలను కనాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ముసలోడు మామూలోడు కాదంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.