Natural Star Nani : తారక్ చిన్న కొడుకు పెద్ద ముదురు…వాడిని అస్సలు భరించలేం…హీరో నాని..

Natural Star Nani  : తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నానికి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా హీరో నాని ” హాయ్ నాన్న ” అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ […]

  • Published On:
Natural Star Nani  : తారక్ చిన్న కొడుకు పెద్ద ముదురు…వాడిని అస్సలు భరించలేం…హీరో నాని..

Natural Star Nani  : తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నానికి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా హీరో నాని ” హాయ్ నాన్న ” అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినీ బృందం ప్రమోషన్స్ ను జోరుగా కొనసాగిస్తుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని సుమా హొస్టుగా వ్యవహరించిన ఇంటర్వ్యూకి హాజరవడం జరిగింది. అలాగే ఈ సినిమాలో నటించిన పాప కియారా ఖన్నా కూడా రావడం జరిగింది.

ఈ క్రమంలోనే హీరో నాని సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను సుమా తో పంచుకున్నారు. ఇక ప్రోగ్రాంలో భాగంగా సుమ హీరో నానితో సరదాగా ఒక ఆట ఆడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో కొడుకుల చిన్ననాటి ఫోటోలను చూపించి వాళ్ళు ఎవరో కనిపెట్టాల్సిందిగా కోరింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫోటో కూడా చూపించడం జరిగింది. అయితే మొదట ఈ ఫోటోని నాని గుర్తుపట్టలేకపోయినప్పటికీ తర్వాత తారక్ చిన్న కొడుకు అని చెప్పేసాడు. అవును అని సుమా కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోని చిన్న కొడుకు గురించి హీరో నాని కొన్ని విషయాలను తెలియజేశారు.

తారక్ చిన్న కొడుకు చాలా కచ్చి అని , వాడిని భరించడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. ఇకపోతే తాజాగా హీరో నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ మృణాలు ఠాకూర్ నటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకర్షించగా మృనాల్ ఠాకూర్ క్యూట్ లుక్స్ అందర్నీ ఫిదా చేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు కొత్త దర్శకుడు సౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలై ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.