Jeevitha Rajasekhar : పరువు నష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్ జైలు శిక్ష…12 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెళ్ళడి….

Jeevitha Rajasekhar  : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వార్త దుమారం లేపుతోంది. పరువు నష్టం కేసు లో సినీ నటులు జీవిత మరియు రాజశేఖర్ కు నాంపల్లి లోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఇటీవల సంచలన తీర్పు వెల్లడించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై ఈ దంపతులు చేసిన ఆరోపణలకు పరువు నష్టం దావా పై విచారణ జరిపించిన కోర్టు, మంగళవారం రోజున తీర్పు వెల్లడించింది. ఇక ఈ తీర్పులో జీవిత రాజశేఖర్ […]

  • Published On:
Jeevitha Rajasekhar  : పరువు నష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్ జైలు శిక్ష…12 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెళ్ళడి….

Jeevitha Rajasekhar  : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వార్త దుమారం లేపుతోంది. పరువు నష్టం కేసు లో సినీ నటులు జీవిత మరియు రాజశేఖర్ కు నాంపల్లి లోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఇటీవల సంచలన తీర్పు వెల్లడించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై ఈ దంపతులు చేసిన ఆరోపణలకు పరువు నష్టం దావా పై విచారణ జరిపించిన కోర్టు, మంగళవారం రోజున తీర్పు వెల్లడించింది. ఇక ఈ తీర్పులో జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష మరియు ఐదువేల రూపాయల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు యొక్క పూర్వపరాలను పరిశీలిస్తే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందిస్తూ సేవలందిస్తున్నారు.

jivita-rajasekhar-sentenced-to-jail-in-defamation-case-judgment-after-12-years-long-trial

అయితే సినీ నటులు జీవిత రాజశేఖర్ చిరంజీవి ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు వ్యాఖ్యలు చేశారు. 2011లో జీవిత రాజశేఖర్ ఓ ప్రెస్ మీట్ లో ఈ విధంగా ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారారు. అయితే వీరు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశాడు. చిరంజీవి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని , ఎంతోమంది ఈ సేవలను అందుకుంటున్నారని , అలాంటి చిరంజీవి పరువుకు నష్టం కలిగించేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి ట్రస్ట్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వారిపై పరువు నష్టం దావా కేసు ను వేశారు.

jivita-rajasekhar-sentenced-to-jail-in-defamation-case-judgment-after-12-years-long-trial

అంతేకాక వీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను సిడీ రూపంలో కోర్టుకు సమర్పించారు. దీంతో కేసు యొక్క పూర్వపరాలను పరిశీలించిన కోర్టు ,సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల తీర్పును వెల్లడించింది. దంపతులిద్దరికీ ఏడాది పాటు జైలు శిక్షతో మరియు 5000 రూపాయల జరిమానా విధించినట్లు కోర్ట్ తెలియజేసింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై జిల్లా కోర్టు ను ఆశ్రయించే అవకాశం ఉండడంతో , జీవిత రాజశేఖర్ జరిమానాన్ని చెల్లించి బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. ఈ కేసు విషయంలో జిల్లా కోర్టును ఆశ్రయిస్తామంటూ జీవిత రాజశేఖర్ చెప్తున్నారు. మరి అక్కడైనా వీరికి పరిస్థితి అనుకూలుస్తుందో లేదో భవిష్యత్తులో చూడాలి.