Vinayakan : జైలర్ మూవీ విలన్ అరెస్ట్….దేనికో తెలుస్తే షాక్ అవుతారు…

Vinayakan  : ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంతటి ప్రజాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్ అభిమానుల ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే మునిపెన్నడూ లేని క్రేజ్ వినాయకన్ కు లభించింది. ఈ నేపధ్యంలోనే జైలర్ సినిమాలో వినాయకన్ నటించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కూడా అయ్యాయి. ఇది ఇలా ఉండగా తాజాగా […]

  • Published On:
Vinayakan : జైలర్ మూవీ విలన్ అరెస్ట్….దేనికో తెలుస్తే షాక్ అవుతారు…

Vinayakan  : ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంతటి ప్రజాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్ అభిమానుల ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే మునిపెన్నడూ లేని క్రేజ్ వినాయకన్ కు లభించింది. ఈ నేపధ్యంలోనే జైలర్ సినిమాలో వినాయకన్ నటించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కూడా అయ్యాయి. ఇది ఇలా ఉండగా తాజాగా కేరళ పోలీసులు వినాయకన్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మద్యం సేవించి తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ వాసులను ఇబ్బందికి గురి చేస్తున్నందుకు గాను వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

jailer-movie-villain-arrested

ఈ క్రమంలోనే వినాయకన్ ను ఏర్నాకుళం నార్త్ టౌన్ పోలీసులు స్టేషన్ కు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే తప్ప తాగి ఉన్న వినాయకన్ వారితో గొడవకు దిగినట్లు సమాచారం. ఇక వినాయకన్ పోలీసులతో వాదిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు ఎంతగా వారించిన వినాయకన్ వినకపోవడం తో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం పోలీస్ స్టేషన్ బేయిల్ పై అతను విడుదలయ్యాడు.ఇది ఇలా ఉండగా గతంలో కూడా వినాయకన్ ఓ మోడల్ ను వేధించినందుకుగాను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరొక వివాదంతో వినాయకన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.