Rajamouli : పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చి ఉంటే వేరేలా ఉండేది సార్ …ఆనంద్ మహేంద్ర ట్విట్ కి రిప్లై ఇచ్చిన రాజమౌళి..

Rajamouli  : దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లలో ఒకటిగా మారాడు. అంతేకాక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియాకు ఆస్కార్ ను కూడా తీసుకొచ్చారు. దీంతో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర జక్కన్న గురించి ట్విట్ చేశాడు. దీంతో ఆ న్యూస్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. అయితే దేశంలోని బడా పారిశ్రామికవేత్తల లో ఆనంద్ మహేంద్రా ఒకరు అని చెప్పాలి . వ్యాపార రంగంలో రాణించే ఆనంద్ మహేంద్ర కు […]

  • Published On:
Rajamouli : పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చి ఉంటే వేరేలా ఉండేది సార్ …ఆనంద్ మహేంద్ర ట్విట్ కి రిప్లై ఇచ్చిన రాజమౌళి..

Rajamouli  : దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లలో ఒకటిగా మారాడు. అంతేకాక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియాకు ఆస్కార్ ను కూడా తీసుకొచ్చారు. దీంతో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర జక్కన్న గురించి ట్విట్ చేశాడు. దీంతో ఆ న్యూస్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. అయితే దేశంలోని బడా పారిశ్రామికవేత్తల లో ఆనంద్ మహేంద్రా ఒకరు అని చెప్పాలి . వ్యాపార రంగంలో రాణించే ఆనంద్ మహేంద్ర కు సినీ రంగంపై మక్కువ ఎక్కువ. దీంతో ఆయనకు వీలు కుదిరిన ప్రతిసారి సినీ సెలెబ్రెటీస్ ను కలుస్తుంటాడు. అంతేకాక తన సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలను ట్విట్ చేస్తూ టచ్ లో ఉంటాడు. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్లో చేసిన ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

if-pakistan-had-given-permission-it-would-have-been-different-sir-rajamouli-replied-to-anand-mahendras-tweet

ఇక ఆయన చేసిన ట్విట్ మరెవరిదో కాదు.. ఆర్ఆర్ ఆర్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించి ఇండియాకు తొలి ఆస్కార్ అవార్డును తెచ్చి పెట్టిందంటూ రాస్కొచ్చారు. మహేంద్ర తన ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేస్తూ మన సంస్కృతి మనకు గుర్తుతెచ్చే వాటిలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయాని, మన నాగరికతను తెలియజేసేలా అప్పటి కాలానికి చెందిన కథను దర్శికుడు రాజమౌళి సినిమా తీయాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనివలన నేటి తరం వారికి కూడా పూర్వీకులు నాగరికత అర్థమవుతుందంటూ తెలియజేశారు. అయితే ఆనంద్ మహేంద్ర చేసిన ట్విట్ కు రాజమౌళి స్పందించారు. అలాగే సార్ అంటూ రాజమౌళి కామెంట్ చేశారు.

అలాగే నేను దోలా వీర ప్రాంతంలో మగధీర సినిమాను షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక చెట్టును గమనించానని, అది శిలాజాలంగా మారిపోవడం చూశానని, సింధులోయ సాంస్కృతి గురించి ఆ చెట్టు కథ చెబుతున్నట్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందని, దాంతో కొన్ని సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ సందర్శించి ఆ ప్రాంతం గురించించి గట్టిగా తెలుసుకోవాలని ప్రయత్నించాను కానీ పాకిస్తాన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా , కే.ఎల్ నారాయణ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు సమాచారం.