Suma Kanakala :  నా ఇంట్లో నాకు మర్యాద లేదు.. సుమా కనకాల..

Suma Kanakala :  బుల్లితెరపై ఎప్పటినుంచో యాంకరింగ్ చేస్తూ సీనియర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది సుమ కనకాల. ఈమె పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా అచ్చ తెలుగు అమ్మాయిల స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ అంటే తెలియని వారే ఉండరు. స్టార్ మాతో తెలుగు రాష్ట్ర మహిళలను అభిమానులుగా మలుచుకుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ షో లే కాకుండా వెండితెరకు సంబంధించిన సిని అవార్డు ఫంక్షన్స్ , ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ […]

  • Published On:
Suma Kanakala :  నా ఇంట్లో నాకు మర్యాద లేదు.. సుమా కనకాల..

Suma Kanakala :  బుల్లితెరపై ఎప్పటినుంచో యాంకరింగ్ చేస్తూ సీనియర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది సుమ కనకాల. ఈమె పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా అచ్చ తెలుగు అమ్మాయిల స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ అంటే తెలియని వారే ఉండరు. స్టార్ మాతో తెలుగు రాష్ట్ర మహిళలను అభిమానులుగా మలుచుకుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ షో లే కాకుండా వెండితెరకు సంబంధించిన సిని అవార్డు ఫంక్షన్స్ , ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ సుమా కనకాల లేకుండా జరగవు. సుమా కనకాల లేకుండా ఆ కార్యక్రమాలు అంత సక్సెస్ అవ్వవని అర్థం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అంతటి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది సుమ కనకాల. అంతేకాక ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించి వెండితెరపై కూడా అడుగుపెట్టింది. అయితే సుమ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ జోష్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగే కొన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సండే స్పెషల్ బిర్యానీ అంటూ సుమా ఒక వీడియో చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో సుమ సండే స్పెషల్ బిర్యాని అంటూ బిర్యానీ చేయసాగింది.

బిర్యానీ చేయడం పూర్తయ్యాక , సండే స్పెషల్ బిర్యానీ అనగానే తన ఇంట్లో పని చేసే పని మనుషులు నవ్వడం మొదలెట్టారు. ఎందుకు నవ్వుతున్నారు నేను బిర్యాని చేశానని నవ్వుతున్నారా ఏంటి అని నవ్వ సాగింది.నా ఇంట్లో నాకు మర్యాద లేకుండా పోయిందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది సుమా కనకాల.తర్వాత బాయ్ బాయ్ అంటూ వీడియోను ఆపేసారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. సుమ బయటనే కాదు ఇంట్లో వారి పని వాళ్ళతో కూడా అంతే సరదాగా ఉంటుందని ఈ వీడియో ద్వారా అర్థం అవుతుంది. అంతటి స్థానంలో ఉండి కూడా ఎలాంటి గర్వం లేకుండా అందరినీ ఒకే విధంగా చూసే సుమా మనసుకు అందరూ ఫిదా అయిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)