Honey Rose : కత్తి పట్టుకున్న బాలకృష్ణ హీరోయిన్….ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలుగా లేదుగా…..

Honey Rose : హనీ రోస్….ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు. 15 ఏళ్ల కిందటే ‘ ఆలయం ‘ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఆ తరువాత వరుణ్ సందేశ్ తో కలిసి ‘ ఈ వర్షం సాక్షిగా’ అనే సినిమా లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు […]

  • Published On:
Honey Rose : కత్తి పట్టుకున్న బాలకృష్ణ హీరోయిన్….ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలుగా లేదుగా…..

Honey Rose : హనీ రోస్….ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు. 15 ఏళ్ల కిందటే ‘ ఆలయం ‘ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఆ తరువాత వరుణ్ సందేశ్ తో కలిసి ‘ ఈ వర్షం సాక్షిగా’ అనే సినిమా లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు లభించలేదు. దీంతో కొన్నాళ్లపాటు తెలుగు సినిమాలకు దూరమైన హనీ రోజ్ , ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.  సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హనీ రోస్ కు మంచి బ్రేక్ లభించింది.

honey-rose-the-first-look-poster-is-not-normal

నిజం చెప్పాలంటే ఈ సినిమా తర్వాత ఆన్ స్క్రీన్ లో కంటే కూడా ఆఫ్ స్క్రీన్ లోనే ఈమెకు పాపులారిటీ పెరిగింది. మరి ముఖ్యంగా నేటి తరం కుర్రాళ్లను బాగా ఎట్రాక్ట్ చేసింది. పలు షాపింగ్ మాల్స్ ను కూడా ఓపెనింగ్ కు హనీ రోస్ వస్తుందని తెలిస్తే చాలు యూత్ మొత్తం అక్కడికి చేరుకుంటున్నారు. అంతలా ఆమె తన అందాలతో అందరిని కట్టి పడేసింది . ఇదిలా ఉంటే ప్రస్తుతం హానీ రోస్ మలయాళం లో రాచల్ అనే ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ హనీ రోస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇక ఈ పోస్టర్ లో హానీ లుక్కు అందర్నీ ఆశ్చర్యపరిచింది. చేతిలో కత్తి పట్టుకొని మాంసం కొడుతున్నట్లు , ఊర మాస్ లుక్ తో ఉన్న హానీ పోస్టర్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. పోస్టర్ లో గమనిస్తే చుట్టూ దున్నపోతుల తలకాయలతో ,మాంసముక్కులతో హనీ బీప్ మాంసం కొడుతున్నట్లు అర్థమవుతుంది. వీర సింహారెడ్డిలో గ్లామర్ గా చూసిన హనీ ను ఒక్కసారిగా ఇలా చూడడంతో పలువురు ఆశ్చర్యపోయారు. కేక పెట్టిస్తున్న ఆమె లుక్స్ మాత్రం అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ పోస్టర్ ఆధారంగా చూస్తే హనీ ఈ సినిమాలో ఓ సీరియస్ పాత్రలో నటించబోతుందని అర్థమవుతుంది. మరి ఈ సినిమా హనీకు ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)