Karthika : తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ కార్తీక…కాబోయే వాడిని పొగిడేస్తూ…

Karthika  : తెలుగు సినీ ఇండస్ట్రీ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కూతురు కార్తిక అందరికీ తెలిసే ఉంటుంది. నాగచైతన్య సరసన జోష్ సినిమాలో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది కార్తిక. అయితే హీరోయిన్ గా అంతగా గుర్తింపు రాకపోవడంతో గత కొంతకాలంగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లికి రెడీ అయింది. ఈ తరుణంలోనే గత నెలలో ఎంగేజ్మెంట్ ను చాలా సైలెంట్ గా […]

  • Published On:
Karthika : తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ కార్తీక…కాబోయే వాడిని పొగిడేస్తూ…

Karthika  : తెలుగు సినీ ఇండస్ట్రీ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కూతురు కార్తిక అందరికీ తెలిసే ఉంటుంది. నాగచైతన్య సరసన జోష్ సినిమాలో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది కార్తిక. అయితే హీరోయిన్ గా అంతగా గుర్తింపు రాకపోవడంతో గత కొంతకాలంగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లికి రెడీ అయింది. ఈ తరుణంలోనే గత నెలలో ఎంగేజ్మెంట్ ను చాలా సైలెంట్ గా చేసుకుంది. ఇక దానికి సంబంధించిన ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా వార్తలలో నిలిచింది. ఇక ఆ ఫోటోలో ఓ వ్యక్తిని కార్తిక కౌగిలించుకొని ఉండటంతో , అలాగే వారి మొహాల కంటే కూడా వెలికి ఉన్న ఉంగరాన్ని ఎక్కువగా హైలెట్ చేయడంతో కార్తిక ఎంగేజ్మెంట్ జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే ఇలా వచ్చిన వార్తలకి కార్తిక లేటెస్ట్ ఫోటోలతో సమాధానం చెప్పింది.

heroine-kartika-who-gave-clarity-on-her-marriage-praising-her-future-husband

ఈ నేపథ్యంలోనే తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ కార్తీక్ అఫీషియల్ గా తన భర్తను పరిచయం చేసింది. తన భర్తతో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం అనేది మ్యాజిక్..మన జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ వ్రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం కార్తీక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నేటి జనులు కాబోయే కపుల్స్ కు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు

ఇదిలా ఉండగా కార్తిక సినిమాల గురించి మాట్లాడుకుంటే నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో సరసన నటించినప్పటికీ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ సరసన దమ్ము, అల్లరి నరేష్ బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించిన సరైన గుర్తింపు రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటూ ఇప్పుడు పెళ్లి వేడుకలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.